ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరించాలి

ABN, First Publish Date - 2021-10-25T06:27:34+05:30

క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని పెంపొందించుకుని గెలుపోటములను సమానంగా స్వీకరించాలని జడ్పీ చైర్మన్‌ శ్రీనివాసులు పేర్కొన్నారు.

విజయం సాధించిన ఏపీ బాలుర జట్టు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జడ్పీ చైర్మన్‌ శ్రీనివాసులు


సౌత్‌ ఇండియా షూటింగ్‌బాల్‌ విజేతలుగా ఏపీ జట్లు


కురబలకోట, అక్టోబరు24: క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని పెంపొందించుకుని గెలుపోటములను సమానంగా స్వీకరించాలని జడ్పీ చైర్మన్‌ శ్రీనివాసులు పేర్కొన్నారు. అంగళ్లు సమీపంలోని గోల్డెన్‌వ్యాలీ విద్యాసంస్థల మైదానంలో రెండు రోజుల పాటు నిర్వహించిన సౌత్‌ ఇండియా షూటింగ్‌బాల్‌ టోర్నమెంట్‌-21  ఆదివారం ముగిసింది. కప్‌ ప్రదానోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ క్రీడాకారులు పట్టుదల, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే   విజయాలను సునాయాసంగా సొంతం చేసుకోవచ్చన్నారు.  


బాలుర, బాలికల షూటింగ్‌బాల్‌ టోర్నీ విజేతగా ఏపీ జట్లు


షూటింగ్‌ బాల్‌ టోర్నీలో రాష్ట్ర బాలురు, బాలికల జట్లు షూటింగ్‌బాల్‌ టోర్నీ విజేతలుగా  నిలిచాయి. ఆదివారం జరిగిన పోటీల్లో బాలికల విభాగంలో  ఆంధ్రప్రదేశ్‌ జట్టు విజేతగా నిలించింది. రన్నర్స్‌గా తమిళనాడు, తృతీయస్థానంలో కర్ణాటక జట్లు నిలిచాయి. అలాగే బాలుర విభాగంలో ఆంధ్రప్రదేశ్‌ విన్నర్స్‌గా, రన్నర్స్‌గా కేరళ,  తృతీయస్థానంలో తమిళనాడు జట్లు  నిలిచాయి.  క్రీడాకారులకు  జడ్పీ చైర్మన్‌ శ్రీనివాస్‌, గోల్డెన్‌వ్యాలీ కరెస్పాండెంట్‌ ఎన్‌.వి. రమణారెడ్డి  కప్పులు ప్రదానం చేశారు.

Updated Date - 2021-10-25T06:27:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising