ఏనుగుల సంచారంతో రైతుల ఆందోళన
ABN, First Publish Date - 2021-01-13T05:23:16+05:30
మండలంలోని నెల్లిపట్ల గ్రామ సమీపంలోని కురవూరు మంగళవారం 14 ఏనుగుల గుంపు కనిపించడంతో రైతులు భయంతో పరుగులు తీశారు.
నెల్లిపట్ల సమీపంలో సంచరిస్తున్న ఏనుగులు
బైరెడ్డిపల్లె, జనవరి 12 : మండలంలోని నెల్లిపట్ల గ్రామ సమీపంలోని కురవూరు మంగళవారం 14 ఏనుగుల గుంపు కనిపించడంతో రైతులు భయంతో పరుగులు తీశారు. రైతులు కేకలు వేయడంతో గజరాజులు సమీపంలోని అడవిలోకి వెళ్లిపోయాయి. ఏనుగుల మంద పొలాలను ధ్వంసం చేయకుండా అడవిలోకి వెళ్లిపోవడంతో రైతులు ఊపిరిపీల్చుకున్నారు. అయితే పొలాలవద్ద నివాసం ఉంటున్న రైతులు ఏక్షణంలో ఏనుగుల రూపంలో ఉపద్రవం ముంచుకొస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. అటవీశాఖాధి కారులు స్పందించి ఏనుగుల బారినుంచి తమకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు.
Updated Date - 2021-01-13T05:23:16+05:30 IST