ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శతాధిక వృద్ధురాలికి పెన్షన్‌ అపేశారు

ABN, First Publish Date - 2021-10-25T05:26:15+05:30

ఆ అవ్వ శతాధిక వృద్ధురాలు, విధి రాసిన జీవిత ప్రయాణం మైలురాయి దాటేసింది.

శతాధిక వృద్దురాలు లక్ష్మమ్మ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వెదురుకుప్పం, అక్టోబరు 24: ఆ అవ్వ శతాధిక వృద్ధురాలు, విధి రాసిన జీవిత ప్రయాణం మైలురాయి దాటేసింది. వయసు మీద పడటంతో కంటి చూపు మందగించింది. శరీర భాగాలు సహకరించక ఈతి బాధలు అనుభవిస్తోంది. అలాంటి ఓ అవ్వకు డిప్యూటీ సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న గంగాధరనెల్లూరు నియోజకవర్గంలో వైఎ్‌సఆర్‌ పెన్షన్‌ కానుకను ఆపేశారు. వెదురుకుప్పం మండలం కొమరగుంటకు చెందిన వేపరెడ్డి లక్ష్మమ్మ(102)కు అధార్‌ కార్డు ప్రకారం తొంభై ఏళ్లు. కుమారుడు, కోడలు ఉంది. అందరూ ఒకే రేషన్‌ కార్డులో ఉండటం వల్ల లక్ష్మమ్మకు మాత్రమే వితంతు పెన్షన్‌ వస్తోంది. వీరికి ఆ పెన్షన్‌ సొమ్ము అధారం. మూడు నెలలుగా ఆ అవ్వకూ పెన్షన్‌ ఆపేశారు. సాంకేతిక కారణాలతో ఆపేసినట్లు సచివాలయ ఉద్యోగి ఒకరు తెలిపారు. 


కళ్లు పూడిసినాయి

కళ్లు పూడిసినాయి, ఒళ్లంతా నొప్పి. కళ్లలో నీరుగారుతాయి. ఏందిసామి. నన్ను ఎట్లా తీసుకుని బోతాడు దేవుడు. కూచోగుళ్ల, పడుకోగుళ్లా, పెన్షన్‌ ఇలేదంటారు. మూడు నెలలైంది. నా కొడుక్కి, కోడలికి ఒళ్లు బాగా లేదు.

- లక్ష్మమ్మ, కొమరగుంట



నా దృష్టికి రాలేదు

కొమరగుంటలో లక్ష్మమ్మకు పెన్షన్‌ ఆగిపోయిన విషయం నా దృష్టికి రాలేదు. వివిధ కారణాలతో అర్హత లేని కొన్ని పెన్షన్‌ తొలగించారు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం.

 - సుధాకర్‌ రావు, ఎంపీడీవో వెదురుకుప్పం

Updated Date - 2021-10-25T05:26:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising