ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పండ్లతోటల పెంపకానికి ప్రాధాన్యం

ABN, First Publish Date - 2021-05-13T06:37:40+05:30

పండ్లతోటల పెంపకానికి ప్రాధాన్యం ఇవ్వాలని ఉపాధి పథకం జిల్లా అంబుడ్స్‌మెన్‌ రాసరాయ నాయుడు అన్నారు.

సమావేశంలో ప్రసంగిస్తున్న రాసరాయ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏర్పేడు, మే 12: పండ్లతోటల పెంపకానికి ప్రాధాన్యం ఇవ్వాలని ఉపాధి పథకం జిల్లా అంబుడ్స్‌మెన్‌ రాసరాయ నాయుడు అన్నారు. బుధవారం స్థానిక స్త్రీశక్తి భవనంలో ఆయన ఉపాధి సిబ్బందితో మాట్లాడుతూ... పండ్లతోటల పెంపకంతో అధిక లాభాలు సాధ్యమని గుర్తుచేశారు. ప్రభుత్వం రైతులకు ఉచితంగా అల్లనేరేడు, మామిడి, సపోట, నిమ్మ, సీతాఫలం, జామ, ఉసిరి, చింత, టెంకాయ మొక్కలను పంపిణీ చేస్తున్నట్లు గుర్తుచేశారు. మల్లెపూల తోటల ఏర్పాటుకూ నిధులు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. ఉపాధి పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని కోరారు. ఈ దిశగా రైతులను చైతన్యం చేయాల్సిన బాధ్యత ఫీల్డ్‌ అసిస్టెంట్లదే అన్నారు. ఉపాధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలనీ, కూలీల సంఖ్య పెంచాలని ఆదేశించారు. కార్యక్రమంలో డ్వామా ఏపీడీ పద్మలత, ఏపీవో దేవరి, వీసీ మునిశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-13T06:37:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising