ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూపు కోల్పోయిన రోడ్లు

ABN, First Publish Date - 2021-07-15T06:01:41+05:30

రెండేళ్ళుగా నిర్వహణ నిధులు విడుదల కాక చిత్తూరు జిల్లాలోని రోడ్లు దెబ్బతిని అధ్వానంగా మారాయి.

గుంతలమయమైన పీటీఎం మండలం కందుకూరు-చేలూరు రోడ్డు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రెండేళ్ళుగా విడుదల కాని నిర్వహణ నిధులు


తిరుపతి, జూలై 14(ఆంధ్రజ్యోతి): రెండేళ్ళుగా రోడ్ల నిర్వహణకు నిధులు విడుదల కాకపోవడంతో జిల్లాలో ప్రధాన రహదారులు మొదలుకుని గ్రామీణ రహదారుల వరకూ దాదాపుగా అన్నీ రూపు కోల్పోయాయి. కుప్పం నుంచీ ఎర్రావారిపాళ్యం వరకూ... ములకలచెరువు నుంచీ శ్రీకాళహస్తి దాకా... గుడిపాల నుంచీ కలకడ పర్యంతం... జాతీయ రహదారులు మొదలుకుని ఆర్‌ అండ్‌ బీ, పంచాయతీరాజ్‌ రోడ్ల దాకా ఇదే పరిస్థితి. తాజాగా కురుస్తున్న వర్షాలకు రోడ్లన్నీ మరింత దారుణంగా మారాయి. ఈ మార్గాల్లో ప్రయాణించే వాహనదారుల సహనం పరీక్షిస్తూ వారికి చుక్కలు చూపుతున్నాయి. నేషనల్‌ హైవేస్‌ అథారిటీ పరిధిలోని రోడ్లకు, సాధారణ జాతీయ రహదారుల నిర్వహణకు మాత్రమే ఏటా నిధులు విడుదల అవుతుంటాయి. మిగిలిన ఆర్‌ అండ్‌ బీ రోడ్లకు, పంచాయతీ రాజ్‌ రోడ్లకు మాత్రం రెండేళ్ళుగా నిర్వహణ కోసం నిధులు విడుదలైన జాడ లేదు. చిత్తూరు నుంచీ పూతలపట్టు, కల్లూరు, పీలేరు, కలకడ మీదుగా కడప మార్గం, ములకలచెరువు నుంచీ అంగళ్ళు, మదనపల్లె, వాల్మీకిపురం, పీలేరు, భాకరాపేట, తిరుపతి, రేణిగుంట మీదుగా శ్రీకాళహస్తి వరకూ, పలమనేరు నుంచీ పుంగనూరు మీదుగా మదనపల్లె వరకూ, మదనపల్లె నుంచీ అంగళ్ళు, గుర్రంకొండ మీదుగా రాయచోటి మార్గం, తిరుపతి నుంచీ పుత్తూరు, నగరి మార్గం వంటివి సాధారణ జాతీయ రహదారుల పరిధిలోకి చేరుతాయి. ఇవి 800 కిలోమీటర్ల నిడివి కలిగి వున్నాయి. వీటి నిర్వహణకు ఏటా నిఽధులు విడుదలవుతాయి. అయినా కూడా ఈ రోడ్లన్నీ బాగా దెబ్బతిని వున్నాయి. ప్రస్తుత వర్షాలకు పరిస్థితి మరింత దిగజారింది. ఇక ఆర్‌ అండ్‌ బీ రోడ్లు 4960 కిలోమీటర్ల నిడివితో వున్నాయి. పంచాయతీ రాజ్‌ పరిధిలో 6717 కిలోమీటర్ల పొడవు కలిగిన 4100 రోడ్లున్నాయి. ఇందులో 400 కిలోమీటర్లు సిమెంట్‌ రోడ్లు, 2312 కిలోమీటర్ల మేరకు తారు రోడ్లు, 458 కిలోమీటర్ల పొడువునా మెటల్‌ రోడ్లు, 3457 కిలోమీటర్ల నిడివితో మట్టి రోడ్లున్నాయి. ఆర్‌ అండ్‌ బీ, పంచాయతీ రాజ్‌ రోడ్ల నిర్వహణకు రెండేళ్ళుగా నిధులేవీ విడుదల కాలేదు. దీంతో రోడ్లపై గోతులు ఏర్పడ్డాయి. ఇక వర్షాలకు అవి మరింతగా దెబ్బతిని వాహనాల రాకపోకలకు తీవ్ర అసౌకర్యంగా పరిణమిస్తున్నాయి.

Updated Date - 2021-07-15T06:01:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising