ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధర వెలవెల.. రైతు విలవిల

ABN, First Publish Date - 2021-06-03T05:30:00+05:30

టమోటా ధరలు పతనం కావడంతో రైతన్న లు విలవిలలాడుతున్నారు. చేసేదిలేక టమోటాలను కోయకుండా పొలా ల్లోనే వదిలేస్తున్నారు.

రామానాయునికోట వద్ద పొలంలో వదిలేసిన పంట
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 మొక్కలకే వదిలేస్తున్న పంట

  గిట్టుబాటు కాక రోడ్డుపక్కన పారబోస్తున్న టమోటాలు

 ములకలచెరువు, జూన్‌ 3: టమోటా ధరలు పతనం కావడంతో రైతన్న లు విలవిలలాడుతున్నారు. చేసేదిలేక టమోటాలను కోయకుండా పొలా ల్లోనే వదిలేస్తున్నారు. ములకలచెరువు వ్యవసాయ మార్కెట్‌లో గురువారం 30 కిలోల బాక్సు నాణ్యతను బట్టి రూ.50 నుంచి రూ.100 వరకు మాత్రమే పలికాయి. ములకలచెరువు నుంచి తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు తదితర రాష్ట్రాలకు టమోటాలు ఎగుమతయ్యేవి. కరోనా కారణంగా ఆయా  రాష్ట్రాలలో సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలులో ఉండడంతో ఇక్కడ నుంచి టమోటా ఎగుమతి ఆగిపోడంతో ధరలు పూర్తిగా పతనావతస్థకు చేరుకు న్నాయని వ్యాపారస్తులు చెబుతున్నారు. ప్రస్తుతం స్ధానిక మార్కెట్‌ నుంచి టమోటాలు కేవలం కర్ణాటకకు మాత్రమే ఎగుమతి అవుతున్నాయి. ఈ క్రమంలో ధరలు లేక రైతులు టమోటాలను కోయకుండా పొలాల్లోనే వదిలేస్తున్నారు. కొందరు రైతులు టమోటాలను ముంబాయి - చెన్నై జాతీయ రహదారి పక్కన పడేసి వెళ్తున్నారు. ధర లేకపోవడంతో పంటల కోసం చేసిన అప్పు ఎలా తీర్చాలో అర్ధంకాక రైతన్నలు కుమిలిపోతున్నారు. టమోటాకు గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వమే తమను ఆదుకోవాలని పలువురు రైతులు కోరుతున్నారు. 



Updated Date - 2021-06-03T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising