ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మదనపల్లె అభివృద్ధికి పోరాటం: సీపీఐ

ABN, First Publish Date - 2021-10-27T05:43:01+05:30

మదనపల్లె సమగ్రాభివృద్ధి కోసం నిరంతరం సీపీఎం పోరాటాలు చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. పట్టణ మహాసభలు ముగింపు సందర్భంగా మంగళవారం ప్రెస్‌క్లబ్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... కేంద్రంలో బీజేపీ రెండో సారి అధికారంలోకి వచ్చాక ఏపీకి తీరని ద్రోహం చేసిందని ఆరోపించారు.

సమావేశంలో మాట్లాడుతున్న సీపీఎం రాష్ట్రకమిటీసభ్యుడు వి. వెంకటేశ్వర్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మదనపల్లె అర్బన్‌, అక్టోబరు 26: మదనపల్లె సమగ్రాభివృద్ధి కోసం నిరంతరం సీపీఎం పోరాటాలు చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. పట్టణ మహాసభలు ముగింపు సందర్భంగా మంగళవారం ప్రెస్‌క్లబ్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... కేంద్రంలో బీజేపీ రెండో సారి అధికారంలోకి వచ్చాక ఏపీకి తీరని ద్రోహం చేసిందని ఆరోపించారు. ప్రత్యేకహోదా, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి ప్యాకేజీ నిధులు విడుదల చేయడంలో మొండి చెయ్యి చూపిస్తున్నా రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశసంపదను  కార్పొరేట్‌ శక్తులు అంబానీ, ఆదానీకే కట్టబెడుతోందన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల సాకుతో అభివృద్ధి కార్యక్రమాలను గాలికి వదిలేసిందన్నారు. మదనపల్లెలో సాగు, తాగునీరు సమస్య పరిష్కారం కావాలంటే హంద్రీనీవా పనులు పూర్తికావాలన్నారు. నిధులులేక ఎక్కడపనులు అక్కడే  ఆగిపోయాయన్నారు. విద్య, వైద్యం సౌకర్యాలు అంతంతమాత్రమే అన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి చాల్లా వెంకటయ్య మాట్లాడుతూ మదనపల్లె పట్టణంలో మూడేళ్ల కాలంలో సీపీఎం నిర్వహించే కార్యక్రమాలను ఈ మహసభలో చర్చించామన్నారు. అలాగే మదనపల్లె పట్టణ కమిటీ కార్యదర్శిగా డి.ప్రభాకర్‌రెడ్డిని సహా కమిటీని ఎన్నుకున్నామన్నారు. పార్టీ జిల్లా కార్యదర్శి వర్గసభ్యుడు పి.శ్రీనివాసులు. నాయకుడు హరీంద్రనాథ శర్మ పాల్గొన్నారు.  


Updated Date - 2021-10-27T05:43:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising