ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేపటినుంచి రోడ్డెక్కనున్న మరిన్ని ఆర్టీసీ బస్సులు

ABN, First Publish Date - 2021-06-19T06:15:48+05:30

కరోనా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కర్ఫ్యూ వేళలను ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పొడిగిస్తూ సడలింపు ఇచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి(కొర్లగుంట), జూన్‌ 18: కరోనా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కర్ఫ్యూ వేళలను ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పొడిగిస్తూ సడలింపు ఇచ్చింది. దీనికి అనుగుణంగా ఆదివారం నుంచి బస్సుల సంఖ్య పెంచడానికి ఆర్టీసీ అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటి వరకు 378 బస్సులు 754 ట్రిప్పులు తిరుగుతున్నాయి. తాజా సడలింపుతో అదనంగా 151 బస్సులను 647 ట్రిప్పులు నడపడంపై చర్చిస్తున్నారు. ప్రస్తుతం తిరుగుతున్న మార్గాలలో బస్సుల ఓఆర్‌ను పరిగణనలోకి తీసుకుని అదనపు సర్వీసులు నడిపే అంశాన్ని ఖరారు చేయనున్నారు. కాగా.. ప్రయాణ సమయం ఎక్కువగా ఉన్న విశాఖ, కాకినాడ, రాజమండ్రి, హైదరాబాదు వంటి ప్రాంతాలకు సర్వీసులు నడపడాన్ని ప్రస్తుతానికి వాయిదా వేశారు. అలాగే తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోనూ కర్ఫ్యూ సడలింపు ప్రకటన ఇంకా వెలువడలేదు. ఆయా రాష్ట్రాల నుంచి అనుమతులు వచ్చాక నిర్ణయం తీసుకోనున్నారు. 

Updated Date - 2021-06-19T06:15:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising