ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్టాన్‌ఫోర్డు వర్శిటీ యూఐఎఫ్‌కు మిట్స్‌ విద్యార్థుల ఎంపిక

ABN, First Publish Date - 2021-10-29T05:43:50+05:30

అమెరికాలోని స్టాన్‌ఫోర్డు వర్శిటీ యూఐఎఫ్‌ (యూనివర్శిటీ ఇన్నోవేషన్‌ ఫెలోస్‌) ప్రోగ్రాంకు 8మంది మిట్స్‌ విద్యార్థుల ఎంపికైనట్లు ప్రిన్సిపాల్‌ సి.యువరాజ్‌ తెలిపారు.

ఎంపికైన విద్యార్థులను అభినందిస్తున్న ప్రిన్సిపాల్‌ యువరాజ్‌ తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కురబలకోట, అక్టోబరు 28: అమెరికాలోని స్టాన్‌ఫోర్డు వర్శిటీ యూఐఎఫ్‌ (యూనివర్శిటీ ఇన్నోవేషన్‌ ఫెలోస్‌) ప్రోగ్రాంకు 8మంది మిట్స్‌ విద్యార్థుల ఎంపికైనట్లు ప్రిన్సిపాల్‌ సి.యువరాజ్‌ తెలిపారు. కళాశాలలో సీఎస్‌ఈ  విభాగానికి చెందిన నితీస్‌, రూపేష్‌, సంగీత, హిమసిరి, మాన్విత బుద్ధలక్మి, వెంకటపునీత్‌ చౌదరి, సులాస్య, సాయిరాఘవి ఎంపికయ్యారు. వీరు 2022లో ఐదు రోజుల పాటు స్టాన్‌ఫోర్డు యూనివర్శిటీని సందర్శించి సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంచుకుంటారు. అనంతరం గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, ఆండ్రాయిడ్‌ హెడ్‌ ఆఫీస్‌లతో పాటు సిలికాన్‌ వ్యాలీని సందర్శిస్తారు. తర్వాత వ్యాపార సంస్థలను ప్రారంభించడానికి కావాల్సిన అం శాలను అక్కడ ప్రతినిధులతో ముఖాముఖి ద్వారా అడిగి తెలుసుకుంటారు. ఇప్పటి వరకు కళాశాలకు చెందిన 46 మంది విద్యార్థులు ఈ తరహా ఫెలోషిప్‌కు ఎంపికైనట్టు ప్రిన్సిపాల్‌ చెప్పారు. ఇక ఎంపికైన విద్యార్థులను కళాశాల కరెస్పాండెంట్‌ ఎన్‌.విజయభాస్కర్‌ చౌదరి, ప్రిన్సిపాల్‌ సి.యువరాజ్‌, డీన్‌ శ్రీమంత్‌బసు, కో-ఆర్డినేటర్‌ విజయ లక్ష్మి, డీన్‌ శ్రీమంత్‌బసు, రామానుజమ్‌ అభినందించారు. 

Updated Date - 2021-10-29T05:43:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising