ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిళాభివృద్ధే ధ్యేయం: మిథున్‌రెడ్డి

ABN, First Publish Date - 2021-10-17T06:15:07+05:30

మహిళల ఆర్థిక పురోభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్నామని ఎంపీ మిథున్‌ పేర్కొన్నారు. నాలుగు విడతల మహిళా సంఘాలకు రుణమాఫీలో భాగంగా రెండో విడత ఆర్థిక తోడ్పా టు అందిస్తున్నామన్నారు.

చెక్కు పంపిణీ చేస్తున్న మిథున్‌ తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మదనపల్లె టౌన్‌/ మదనపల్లె రూరల్‌, అక్టోబరు 16: మహిళల ఆర్థిక పురోభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్నామని ఎంపీ మిథున్‌ పేర్కొన్నారు. శనివా రం మదనపల్లె మండలంలోని పొన్నేటిపాళెం పం చాయతీ చిప్పిలి వద్ద, మదనపల్లె పట్టణంలోని జడ్పీ హైస్కూల్లో ఆసరా కార్యక్రమాల్లో ఆయన మా ట్లాడుతూ... నాలుగు విడతల మహిళా సంఘాలకు రుణమాఫీలో భాగంగా రెండో విడత ఆర్థిక తోడ్పా టు అందిస్తున్నామన్నారు. ఎమ్మెల్యే నవాజ్‌బాషా మాట్లాడుతూ... మదనపల్లె అర్బన్‌, మండలంలోని 3551 మహిళా సంఘాలకు రూ.35.68 కోట్లు ఆసరా నిధి పంపిణీ చేశామన్నారు. ఏపీఎండీసీ చైర్మన్‌ షమీంఅస్లాం, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మనూజ, వైస్‌ చైర్మన్లు జంకా చలపతి, నూర్‌ఆజం ప్రసంగించారు. అనంతరం మహిళా సంఘాలకు చెక్కులు పంపిణీ చేశారు. ఎంపీపీ రెడ్డెమ్మ, మున్సిపల్‌ కౌన్సిలర్లు బీఏఖాజా, కరీముల్లా, శ్రీనివాసులు, రాజేష్‌, పీఎంఎస్‌ఎంఈ, కురబ కార్పొరేషన్‌ డైరెక్టర్లు ఆనందపార్థసారథి, దండు రామాంజులు, వైస్‌ ఎం పీపీ పి.రమణ, సర్పంచులు దండు కరుణాకర్‌రెడ్డి, మహేష్‌, గణేష్‌, శరత్‌, పోతబోలు ఆర్బీకే చైర్మన్‌ నాగరాజు, వెలుగు చంద్ర, నారదరెడ్డి, మెప్మా పీడీ రాధమ్మ, మున్సిపల్‌ కమిషనర్‌ రఘునాథరెడ్డి, ఎం పీడీవో లీలామాధవి, ఏపీఎం సురేష్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-17T06:15:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising