ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మామిడికి గిట్టుబాటు ధర కల్పించాలి

ABN, First Publish Date - 2021-06-22T06:06:52+05:30

మామిడికి గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని రైతులు ఆరోపించారు. సోమవారం మామిడికాయలను కలెక్టరేట్‌ ఎదుట పారబోసి నిరసన తెలిపారు.

కలెక్టరేట్‌ వద్ద మామిడి కాయలను పారబోసి నిరసన తెలుపుతున్న రైతు సంఘాల నేతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- కలెక్టరేట్‌ ఎదుట కాయలను  పారబోసి రైతుల నిరసన


చిత్తూరు, జూన్‌ 21: మామిడికి గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని రైతులు ఆరోపించారు. సోమవారం మామిడికాయలను కలెక్టరేట్‌ ఎదుట పారబోసి నిరసన తెలిపారు. ఆ తర్వాత కలెక్టరేట్‌లోనికి వెళ్లడానికి ప్రయత్నించగా రెండో పట్టణ సీఐ అడ్డుకున్నారు. విషయం తెలుసుకుని నిరసన కార్యక్రమం వద్దకు డీఆర్వో మురళి రాగా.. ఆయనకు తమ సమస్యలను తెలియజేస్తూ.. వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రైతు సంఘ నేతలు మాట్లాడుతూ.. కిలో తోతాపురికి రూ.20 చెల్లించాలని, గుజ్జు పరిశ్రమల సిండికేట్‌ను అడ్డుకోవాలని, మామిడి బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికైనా న్యాయం చేయకుంటే బుధవారం కలెక్టరేట్‌ ఎదుట సామూహిక నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు. ఏపీ రైతు సంఘ జిల్లా అధ్యక్షుడు జనార్దన్‌, కార్యదర్శి పీఎల్‌ నరసింహులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు హేమలత, నాయకులు కుమార్‌రెడ్డి, హరిబాబు నాయుడు, హరి, కోదండ, రైతులు పాల్గొన్నారు.


Updated Date - 2021-06-22T06:06:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising