ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముగింపు దశకు మహాపాదయాత్ర

ABN, First Publish Date - 2021-12-10T16:28:37+05:30

అమరావతి రైతుల మహాపాదయాత్ర ముగింపు దశకు చేరుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు జిల్లా: అమరావతి రైతుల మహాపాదయాత్ర ముగింపు దశకు చేరుకుంది. చిత్తూరు జిల్లాలో జరుగుతున్న పాదయాత్ర ఈనెల 17తో ముగియనుంది. 16న తిరుమల శ్రీవారిని దర్శించుకుని ఆ మరుసటి రోజు తిరుపతికి సమీపంలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని రైతులు భావించినప్పటికీ పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో హైకోర్టును ఆశ్రయించాలని పరిరక్షణ సమితి నిర్ణయించింది.


రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులు న్యాయస్థానం టూ దేవస్థానం పేరుతో నవంబర్ 1న ప్రారంభంచిన మహాపాదయాత్ర గురువారం నాటికి 39వ రోజుకు చేరింది. శుక్రవారం పాదయాత్రకు రైతులు విరామం ఇచ్చారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ప్రస్తుతం పాదయాత్ర కొనసాగుతోంది. ఈ నెల 15 నాటికి అలిపిరికి చేరుకుని 16న శ్రీవారి దర్శనం చేసుకోవాలని రైతులు భావిస్తున్నారు. 17న తిరుపతికి సమీపంలో బహిరంగసభ నిర్వహించాలని రైతులు నిర్ణయించారు.

Updated Date - 2021-12-10T16:28:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising