ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దక్షిణాది రాష్ర్టాల అభివృద్ధి మండలి సమావేశాన్ని విజయవంతం చేద్దాం

ABN, First Publish Date - 2021-02-27T05:26:00+05:30

తిరుపతిలో మార్చి 4న జరగనున్న దక్షిణాది రాష్ర్టాల అభివృద్ధి మండలి సమావేశాన్ని విజయవంతం చేసేందుకు అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌ పిలుపునిచ్చారు.

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ హరినారాయణన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలెక్టర్‌ హరినారాయణన్‌


చిత్తూరు కలెక్టరేట్‌, ఫిబ్రవరి 26: తిరుపతిలో మార్చి 4న జరగనున్న దక్షిణాది రాష్ర్టాల అభివృద్ధి మండలి సమావేశాన్ని విజయవంతం చేసేందుకు అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌ పిలుపునిచ్చారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మార్చి 4న జరిగే దక్షిణాది రాష్ర్టాల అభివృద్ధి మండలి సమావేశం తిరుపతిలో నిర్వహించడం మరువలేని అవకాశం అని అన్నారు. ఈ సమావేశానికి పలువురు కేంద్రమంత్రులు, ఏపీ సీఎం జగన్‌తో పాటు దక్షిణాది రాష్ర్టాల సీఎంలు, వీఐపీలు హాజరవుతారని చెప్పారు. సమావేశంలో ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా లైజన్‌ ఆఫీసర్లు తమ విధులను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. సమావేశంలో పాల్గొనడానికి తిరుపతికి చేరుకునే అతిథులకు రవాణా, వసతి ఏర్పాట్లలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జేసీలు వీరబ్రహ్మం, రాజశేఖర్‌, డీఆర్వో మురళి, తిరుపతి స్మార్ట్‌ సిటీ జీఎం చంద్రమౌళి, చిత్తూరు ఆర్డీవో రేణుక, వివిధ శాఖల అధికారులు, అన్ని మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-27T05:26:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising