ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తిరుపతి రూరల్‌లో చిరుత సంచారం?

ABN, First Publish Date - 2021-10-24T06:59:46+05:30

తిరుపతి రూరల్‌ మండలం వెంకటపతినగర్‌లో చిరుత పులి నడిచిన ఆనవాళ్లు (పాదముద్రలు) కనిపించడంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

చిరుత పులి పాదముద్రలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాదముద్రలు కనిపించడంతో భయాందోళనలో వెంకటపతి నగర్‌వాసులు


తిరుపతి రూరల్‌, అక్టోబరు 23: తిరుపతి రూరల్‌ మండలం వెంకటపతినగర్‌లో చిరుత పులి నడిచిన ఆనవాళ్లు (పాదముద్రలు) కనిపించడంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీ, ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్‌ కాలేజీ పరిసరాల్లో చిరుత సంచరించినట్టు పక్కా ఆధారాలు లభించాయి. ఈ క్రమంలో శుక్రవారం అర్ధరాత్రి చెర్లోపల్లె సమీపంలోని వెంకటపతి నగర్‌లోనూ సంచరించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఎన్జీ రంగా కాలేజీ గోడ దూకి గ్రామంలోకి పులి వచ్చిందని అంటున్నారు. ఈ విషయాన్ని వెంటనే పంచాయతీ అధికారులకు చేరవేయగా, వారు శబ్దం చేయడంతోపాటు మంట వేయడంతో చిరుత అక్కడి నుంచి వెళ్లిపోయిందని పేర్కొంటున్నారు. పైగా ఓ ఇంటి వద్ద ఉన్న కుక్కను లాక్కెళ్లిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇకనైనా తమ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. అలాగే చిరుతను పట్టుకుని తమకు ఎలాంటి ప్రాణాపాయం లేకుండా చూడాలని అటవీ శాఖకు విజ్ఞప్తి చేశారు. 

Updated Date - 2021-10-24T06:59:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising