ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హత్యాయత్నం కేసులో నిందితురాలి అరెస్టు

ABN, First Publish Date - 2021-02-25T06:22:14+05:30

మదనపల్లె పట్టణ నీరుగట్టు వారిపల్లెకు చెందిన సులోచన రెండురోజుల కిందట తన అనుచరు లతో కలసి బసినికొండకు చెందిన హరిబాబు కుటుం బంపై దాడి చేసిన విషయం విదితమే. ఈక్రమంలో సులోచన, అనుచరులు ఇసుకనూతిపల్లెకు చెందిన కుమార్‌, శ్రీని వాసులు సహా మరికొందరిపై హత్యాయత్నం కేసునమోదు చేశారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాత్రికిరాత్రే రిమాండుకు తరలింపు


మదనపల్లె క్రైం, ఫిబ్రవరి 24: మదనపల్లె పట్టణ నీరుగట్టు వారిపల్లెకు చెందిన సులోచన రెండురోజుల కిందట తన అనుచరు లతో కలసి బసినికొండకు చెందిన హరిబాబు కుటుం బంపై దాడి చేసిన విషయం విదితమే. ఈ ఘటనలో హరిబాబు సహా ఏడు గురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే నీరుగట్టువారి పల్లెలో అద్దెస్థలంలో నడుస్తున్న హరిబాబు కు చెందిన మాంసం దుకాణజ తొలగింపు విషయంలో జరిగిన గొడవల్లో భాగంగా సులోచన ఆమె అనుచరులు కలసి హరిబాబు కుటుంబంపై దాడిచేసి హత్యా యత్నానికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈక్రమంలో సులోచన, అనుచరులు ఇసుకనూతిపల్లెకు చెందిన కుమార్‌, శ్రీని వాసులు సహా మరికొందరిపై హత్యాయత్నం కేసునమోదు చేశారు. ఈ కేసులో ఏ1 ముద్దాయిగా పేర్కొన్న సులోచనను మంగళవారం రాత్రి టూటౌన్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా, 14 రోజులు రిమాండు విధించారు. డీఎస్పీ రవి మనోహరాచారి ఈ విషయమై మాట్లాడుతూ హత్యాయత్నం కేసు లో దర్యాప్తు కొన సాగుతోందన్నారు. ప్రస్తుతం ముగ్గురిపై కేసునమోదు చేశామని, అందులో ఒకరిని రిమాండుకు తరలించగా మరో ఇద్దరు పరారీలో ఉన్నారన్నారు. ఘటనకు సంబంధించి సామాజిక మాద్యమాల్లో పోస్టు చేసిన వీడియోలను, సంఘటనా స్థలంలోని సీసీఫుటేజీలను  పరిశీలిస్తున్నామన్నారు. బాధితులెవరైనా సులోచనపై ఫిర్యాదు చేస్తే కొత్త కేసులు నమోదు చేస్తామన్నారు. ఆమెపై ఇప్పటికే టూటౌన్‌, తాలూకా, వన్‌టౌన్‌ పీఎస్‌లో భూ వివాద కేసులు ఉన్నట్లు చెప్పారు. అదేవిధంగా సులోచనపై రౌడీషీటు ఓపెన్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. ఇదిలా ఉండగా సులోచనకు భయపడి చాలామంది ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడంలేదనే విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. అలాంటి వారు ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేస్తే కేసులు నమోదు చేస్తామని సీఐ నరసింహులు పేర్కొన్నారు. 

Updated Date - 2021-02-25T06:22:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising