ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తిరుమల తరహాలో కాణిపాక ఆలయ అభివృద్ధి

ABN, First Publish Date - 2021-10-21T05:15:46+05:30

కాణిపాక క్షేత్రాన్ని తిరుమల తరహాలో అభివృద్ధి చేస్తామని పూతలపట్టు ఎమ్మెల్యే ఎమ్మెస్‌ బాబు, ఆలయ చైర్మన్‌ మోహన్‌రెడ్డి అన్నారు. ఆలయ పాలకమండలి సమావేశం బుధవారం జరిగింది.

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఎమ్మెస్‌ బాబు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రూ.12 కోట్లతో రెండు కల్యాణ మండపాలు

పాలకమండలి సమావేశంలో ఆమోదం


ఐరాల(కాణిపాకం), అక్టోబరు 20: కాణిపాక క్షేత్రాన్ని తిరుమల తరహాలో అభివృద్ధి చేస్తామని పూతలపట్టు ఎమ్మెల్యే ఎమ్మెస్‌ బాబు, ఆలయ చైర్మన్‌ మోహన్‌రెడ్డి అన్నారు. ఆలయ పాలకమండలి సమావేశం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరసిద్ధుడి దర్శనానికి విచ్చేసే సామాన్య భక్తులకు పెద్ద పీట వేస్తామన్నారు. భక్తుల సౌకర్యార్థం రూ.10 కోట్లతో క్యూ కాంప్లెక్సు నిర్మించనున్నట్లు చెప్పారు. అదేవిధంగా రూ.12 కోట్లతో అధునాతన సౌకర్యాలతో రెండు కల్యాణ మండపాలు నిర్మిస్తామని చెప్పారు. ఆలయ అభివృద్ధి కోసం భూమి ఇచ్చిన ఎస్సీ ఉభయదారులకు మరగదాంబిక బ్లాక్‌-3ని కేటాయించడంతో పాటు కొంత స్థలం, రూ.20 లక్షల నగదు అందజేస్తామన్నారు. గణేష్‌ సదన్‌ను ఆధునికీకరించడంతో పాటు వంద అడుగుల రోడ్డును పూర్తి చేస్తామని పేర్కొన్నారు. భక్తులకు ఇబ్బందిలేకుండా ఆలయ పునఃనిర్మాణ పనులు సాయంత్రం 6 గంటల  తరువాత చేసే విషయంపై త్వరలో నిర్ణయం తీసుకొనున్నట్లు వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో పాలకమండలి సభ్యులు గోవర్థన్‌, గోపి, నరసింహులుశెట్టి, మారుతీరావు, కొండయ్య, కాంతమ్మ, సుశీల, ప్రతిమ, లక్ష్మమ్మ, సుబ్బలక్ష్మమ్మ, ఈవో వెంకటేశు, ఈఈ వెంకటనారాయణ, డిప్యూటీ ఈవో గురుప్రసాద్‌, ఏసీ కస్తూరి, ఏఈవో విద్యాసాగర్‌రెడ్డి, పర్యవేక్షకులు శ్రీధర్‌బాబు, కోదండపాణి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-21T05:15:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising