ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రమాద స్థితిలో కందూరు చెరువు కట్ట

ABN, First Publish Date - 2021-10-19T05:41:37+05:30

రామసముద్రం మండలంలోని పెద్దకురవపల్లె పంచాయతీ పరిధిలోని కందూరు చెరువు కట్ట ప్రమాద స్థితికి చేరకుంది.

ప్రమాద స్థితిలో ఉన్న కందూరు చెరువుకట్టను పరిశీలిస్తున్న ఎస్‌ఐ రవీంద్రబాబు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రామసముద్రం, అక్టోబరు 18: మండలంలోని పెద్దకురవపల్లె పంచాయతీ పరిధిలోని కందూరు చెరువు కట్ట ప్రమాద స్థితికి చేరకుంది. కొన్ని నెలలుగా కట్ట కుంగిపోతుండగా ఆయకట్టు రైతులు శ్రమదానం చేసి మట్టితోలి మరమ్మతులు చేపట్టారు. ఈ నేపథ్యంలో పది రోజులుగా కురుస్తున్న వర్షాలకు కట్ట మరింతగా కుంగిపోయి ఏ క్షణమైన తెగిపోవడానికి సిద్ధంగా ఉంది. ఇదే జరిగితే భారీ నష్టం జరుగుతుందని ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలంలోని అన్ని చెరువులు నిండి మొరవలుపొతున్నాయి. ఈ క్రమంలో ఏ ఒక్క చెరువు తెగినావాటి ప్రభావం అన్ని చెరువులపై  పడుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఎస్‌ఐ రవీంద్రబాబు కట్టను పరిశీలించారు. అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని చెప్పారు.  ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని  ఆయకట్టు రైతులు కోరుతున్నారు. 

Updated Date - 2021-10-19T05:41:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising