ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మార్చి 2నుంచి కల్యాణ వెంకన్న బ్రహ్మోత్సవాలు

ABN, First Publish Date - 2021-01-21T05:38:18+05:30

శ్రీనివాసమంగాపురంలోని కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో మార్చి 2 నుంచి 10వ తేది వరకు బ్రహోత్సవాలు జరగనున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి, తిరుపతి/ చంద్రగిరి, జనవరి 20: చంద్రగిరి మండలం శ్రీనివాసమంగాపురంలోని కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో మార్చి 2 నుంచి 10వ తేది వరకు బ్రహోత్సవాలు జరగనున్నాయి. కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ వేస్తున్న సందర్భంగా ఈ బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించనున్నట్లు టీటీడీ జేఈవో బసంత్‌కుమార్‌ తెలిపారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో బుధవారం సాయంత్రం ఆయన అధికారులతో సమీక్షించారు. ఈ బ్రహ్మోత్సవాలకు మార్చి 1న అంకురార్పణ, 2న ధ్వజారోహణం, 6న గరుడ వాహనం, 7న వసంతోత్సవం, 10వ తేదిన చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగిస్తాయన్నారు. వాహన సేవలను ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించనున్నట్లు ఎస్వీబీసీలో ప్రొమో ప్రసారం చేయాలన్నారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై వివిధ విభాగాల అధికారులతో ఆయన చర్చించారు. సీఈ రమేష్‌రెడ్డి, ఎస్‌ఈ జగదీశ్వర్‌రెడ్డి, డిప్యూటీ ఈవో శాంతి, ఎస్‌ఈ వెంకటేశ్వర్లు, అదనపు ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ సునీల్‌కుమార్‌, ఎస్టేట్‌ అధికారి మల్లికార్జున, రవాణా జీఎం శేషారెడ్డి, వీజీవో మనోహర్‌, ఏఈవో ధనంజయుడు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-21T05:38:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising