ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీఎస్‌ఎన్‌ఎల్‌ నెట్‌వర్క్‌ హ్యాక్‌పై దర్యాప్తు

ABN, First Publish Date - 2021-07-29T07:15:56+05:30

బీఎస్‌ఎన్‌ఎల్‌ నెట్‌వర్క్‌ను హ్యాక్‌ చేసిన ఘటనపై ఏడుగురు అనుమానితులను అలిపిరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు స్వాధీనం చేసుకున్న ఎలకా్ట్రనిక్‌ కాల్‌ రూటింగ్‌ పరికరాలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


పోలీసుల అదుపులో ఏడుగురు అనుమానితులు


తిరుపతి(నేరవిభాగం), జూలై 28: బీఎస్‌ఎన్‌ఎల్‌ నెట్‌వర్క్‌ను హ్యాక్‌ చేసిన ఘటనపై ఏడుగురు అనుమానితులను అలిపిరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తిరుపతికి చెందిన గుర్తుతెలియని వ్యక్తులు అంతర్జాతీయ ఫోన్‌ కాల్స్‌ను లోకల్‌ కాల్స్‌గా మార్చి అక్రమంగా కాల్‌ రూటింగ్‌కు ప్పాల్పడుతున్నారంటూ భారత కమ్యూనికేషన్‌ డైరెక్టర్‌ బీవీ మనోజ్‌కుమార్‌ మంగళవారం ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై అలిపిరి సీఐ దేవేంద్రకుమార్‌ దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో ఏడుగురు అనుమానితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి కాల్‌ రూటింగ్‌కు వినియోగించే కంప్యూటర్‌, ఇతర ఎలకా్ట్రనిక్‌ పరికరాలను, 90597 34645, 79956 72806, 72074 40569, 91219 29184, 91219 25958 సెల్‌ నంబర్లకు సంబంధించిన సిమ్‌కార్డులను స్వాధీనం చేసుకున్నారు. అనుమానితులను రహస్యంగా విచారిస్తూ వివరాలను రాబడుతున్నారు. బెంగళూరుకు చెందిన రవి ఇందులో కీలకపాత్రధారిగా తెలుస్తోంది. తిరుపతికి చెందిన హరిప్రసాద్‌, కిరణ్‌, ఫణి తదితరుల నుంచి ఇప్పటికే పోలీసులు చాలావరకు సమాచారాన్ని రాబట్టినట్టు తెలిసింది. సౌదీ, కువైట్‌ తదితర దేశాల్లో అంతర్జాతీయంగా కాల్‌ రూటింగ్‌ నెట్‌వర్క్‌ ఏర్పాటుచేసుకుని, ఇతర దేశాల్లోని కాల్‌ రూటింగ్‌ రాకెట్లతో కలిసి అంతర్జాతీయ కాల్స్‌ను లోకల్‌ కాల్స్‌గా మార్చి సొమ్ము చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. 

Updated Date - 2021-07-29T07:15:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising