ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సి.మల్లవరం వద్ద అడ్డుకున్నా..!

ABN, First Publish Date - 2021-04-18T07:12:04+05:30

దొంగ ఓటర్లను తీసుకొస్తున్నారన్న సమాచారంతో తిరుపతి రూరల్‌ మండలం సి.మల్లవరం వద్ద హైవేలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వద్దకు టీడీపీ నేతలు చేరుకున్నారు.

సాక్షి పేపర్‌ స్టిక్కర్ ఉన్న వాహనంలో దొంగ ఓటర్లను తరలిస్తుండగా ఆ వాహనాన్ని పోలీసులకు పట్టించిన టీడీపీ నేతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చంద్రగిరి, ఏప్రిల్‌ 17: దొంగ ఓటర్లను తీసుకొస్తున్నారన్న సమాచారంతో తిరుపతి రూరల్‌ మండలం సి.మల్లవరం వద్ద హైవేలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వద్దకు టీడీపీ నేతలు చేరుకున్నారు. అనుమానం వచ్చిన వాహనాలను ఆపి, ఎక్కడికి వెళ్ళుతున్నారని ప్రశ్నించారు. కొన్ని వాహనాల్లోని వారు శ్రీవారి దర్శనానికి వెళ్తున్నామని చెప్పగా.. దర్శనం స్లాట్‌ చూపించాలనడంతో దొంగ ఓటర్లు కంగుతిన్నారు. వాళ్ళను మీరెందుకు ప్రశ్నిస్తున్నారంటూ చంద్రగిరి సీఐ రామచంద్రారెడ్డి నిలదీయడంతో వాగ్వాదం జరిగింది. దొంగ ఓటర్లను పట్టించినా, వారికి పోలీసులే సహకరిస్తున్నారని ఆరోపించారు. ధర్నాకు దిగారు. తిరుపతి నుంచి ఎస్‌ఐ జయచంద్ర అక్కడికి చేరుకుని టీడీపీ నాయకులకు సర్దిచెప్పి దొంగ ఓటర్లను తరలిస్తున్న వాహనాలను తిప్పి పంపించారు. కానీ, ఆ వాహనాలు మరో దారిలో తిరుపతికి చేరుకున్నాయి. దొంగ ఓటర్లకు సీఐ వత్తాసు పలుకుతూ అడ్డదారులను చెప్పి వాహనాలను పంపిస్తున్నారని టీడీపీ నేతలు ఆగ్రహించారు. టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఈశ్వర్‌రెడ్డి, చంద్రగిరి మండల పార్టీ అధ్యక్షుడు సుబ్రమణ్యంనాయుడు, నాయకులు గౌస్‌బాషా, గంగపల్లి భాస్కర్‌, బెల్లంకొండ రమేష్‌రాయల్‌, కత్తి సుధాకర్‌, భానుప్రకాష్‌రెడ్డి, మేడసాని కుమార్‌, చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. సాక్షి పేపర్‌ వాహనంలో దొంగ ఓటర్లను తరలిస్తుండగా ఆ వాహనాన్ని పోలీసులకు పట్టించినా వదిలిపెట్టారని టీడీపీ నేతలు ఆరోపించారు.

Updated Date - 2021-04-18T07:12:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising