ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమీకృత వ్యవసాయం, సాంకేతిక విస్తరణలే రక్ష

ABN, First Publish Date - 2021-03-04T07:38:47+05:30

సమీకృత వ్యవసాయంతో పాటు సాంకేతిక విస్తరణలే రైతులకు రక్ష అని వ్యవసాయ వర్సిటీ విస్తరణ విభాగం డైరెక్టర్‌ పి.రాంబాబు తెలిపారు.

కిసాన్‌ మేళాకు జ్యోతిప్రజ్వలన చేస్తున్న అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి(విద్య),మార్చి3: సమీకృత వ్యవసాయంతో పాటు సాంకేతిక విస్తరణలే రైతులకు రక్ష అని వ్యవసాయ వర్సిటీ విస్తరణ విభాగం డైరెక్టర్‌ పి.రాంబాబు తెలిపారు.  తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనాస్థానంలో బుధవారం వ్యవసాయశాఖతో కలసి నిర్వహించిన కిసాన్‌మేళాను ఆయన ప్రారంభించారు.కొత్తగా విడుదల చేసిన విత్తన రకాలు, సాంకేతిక పద్ధతులపై రైతులు తమ అభిప్రాయాలను తెలియపరిస్తే ఇంకా అభివృద్ధి చేసేందుకు వీలుంటుందని తెలిపారు. వ్యవసాయశాఖ జేడీ విజయ్‌కుమార్‌ , వ్యవసాయ కళాశాల ఏడీ రవీంద్రనాథరెడ్డి,ఏడీఆర్‌ ఎల్‌.ప్రశాంతి, ఉద్యానవనశాఖ ఏడీ సుబ్బారెడ్డి, పట్టుపరిశ్రమశాఖ ఏడీ గీతావాణి, పశుసంవర్ధకశాఖ ఏడీ బాలసుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.కిసాన్‌మేళాలో వ్యవసాయ,వెటర్నరీ వర్సిటీలతో పాటు వివిధ ప్రభుత్వ శాఖలు,ప్రైవేటు సంస్థలు ఏర్పాటు చేసిన ఉత్పత్తులు ఆకట్టుకున్నాయి.  డ్రోన్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాగే స్టిల్‌సంస్థ బ్రష్‌కట్టర్‌, మినీటిల్లర్‌ యంత్రాలను ప్రదర్శించారు.పవర్‌వీడర్‌, స్ర్పేయర్స్‌, ఆయిల్‌ఇంజన్‌ లాంటి యంత్రాలు ప్రదర్శనలో ఉంచారు. వ్యవసాయ కళాశాల ఆధ్వర్యంలో ప్రాసెసింగ్‌ చేసిన చిరుధాన్యాలు(కొర్రలు), కందిపప్పు, అనుభవపూర్వక అభ్యసనలో భాగంగా వివిధ ఉత్పత్తులు, కడక్‌నాథ్‌కోళ్లు, నెల్లూరు జోడిపి గొర్రెలు, బ్లాక్‌బెంగాల్‌ మేకలను ప్రదర్శనలో ఉంచారు.

Updated Date - 2021-03-04T07:38:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising