ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముక్కంటి క్షేత్రంలో పాడటం పూర్వజన్మ సుకృతం

ABN, First Publish Date - 2021-03-07T07:20:10+05:30

పరమశివుడికి నేత్రం సమర్పించి భక్తకన్నప్ప ముక్తిని పొందిన క్షేత్రంలో గానాలాపన పూర్వజన్మ సుకృతమని ప్రఖ్యాత సినీ నేపథ్య గాయని పి.సుశీలమ్మ పేర్కొన్నారు

జ్యోతి ప్రజ్వలనతో సాంస్కృతిక ప్రదర్శనలను ప్రారంభిస్తున్న సినీ నేపథ్య గాయని సుశీల
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాళహస్తి అర్బన్‌, మార్చి 6: పరమశివుడికి నేత్రం సమర్పించి భక్తకన్నప్ప ముక్తిని పొందిన క్షేత్రంలో గానాలాపన తన పూర్వజన్మ సుకృతమని ప్రఖ్యాత సినీ నేపథ్య గాయని పి.సుశీలమ్మ పేర్కొన్నారు. ముక్కంటి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ధూర్జటి కళాప్రాంగణంలో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలను  జ్యోతి ప్రజ్వలనతో ఆమె ప్రారంభించారు.నర్తనశాల సినిమాలోని అమ్మా... జననీ శివకామినీ అన్న గీతాన్ని ఆలపించి భక్తులను మంత్రముగ్ధులను చేశారు. అనంతరం పావని శ్రీలత కూచిపూడి నృత్యప్రదర్శన ఆకట్టుకుంది. సినీ వర్ధమాన గాయకులు శరత్‌ సంతోష్‌, నాదప్రియ సంగీత విభావరి మృదుమధురంగా సాగింది. రాత్రి 10 గంటలకు శ్రీరామ నాట్యమండలి కళాకారులు శ్రీరామాంజనేయ యుద్ధం నాటకాన్ని ప్రదర్శించారు. నెల్లూరుకు చెందిన కల్లూరు సుధాకర్‌ నాట్యమండలి ఆధ్వర్యంలో జరిగిన గయోపాఖ్యానం నాటకంతో ప్రదర్శనలు ముగిసాయి. 

Updated Date - 2021-03-07T07:20:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising