ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేనూ అమ్మ దగ్గరకు వెళ్లిపోతున్నా..!

ABN, First Publish Date - 2021-10-28T06:38:40+05:30

తల్లిదండ్రులను కోల్పోవడంతో ఒంటరితనం భరించలేక యువ వైద్యుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బుధవారం తిరుపతి రూరల్‌ అవిలాల పంచాయతీలోని ఆంధ్రాబ్యాంకు కాలనీలో చోటుచేసుకుంది.

సిద్దేశ్వర్‌ (ఫైల్‌ ఫొటో)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒంటరితనం భరించలేక యువడాక్టర్‌ ఆత్మహత్య


తిరుచానూరు, అక్టోబరు 27: తల్లిదండ్రులను కోల్పోవడంతో ఒంటరితనం భరించలేక యువ వైద్యుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బుధవారం తిరుపతి రూరల్‌ అవిలాల పంచాయతీలోని ఆంధ్రాబ్యాంకు కాలనీలో చోటుచేసుకుంది. తిరుచానూరు పోలీసుల కథనం మేరకు.. ఆంధ్రాబ్యాంకు కాలనీకి చెందిన రాజశ్రీ సిద్దేశ్వర్‌(28) ఇటీవల వైద్యవృత్తిని పూర్తిచేశాడు. 2017లో ఇతడి తండ్రి కృష్ణమూర్తి అనారోగ్యంతోను.. ఆరు నెలల కిందట తల్లి కరోనాతోను మృతిచెందారు. అప్పట్నుంచి ఒంటరితనాన్ని భరించలేకపోయాడు. తీవ్ర మనస్తాపానికి గురై సిద్దేశ్వర్‌ మంగళవారం రాత్రి ఇంట్లో విషం తీసుకున్నాడు. స్నేహితులతో పాటు కాలనీ సమీపంలో నివాసం ఉంటున్న తన సోదరి జ్యోత్స్నకు ఫోను చేశాడు. తానూ అమ్మదగ్గరికి వెళ్లిపోతున్నానని, విషం తీసుకుని ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపాడు. వెంటనే జ్యోత్స్న, అమె భర్త అహిత్‌ రాజశ్రీసిద్దేశ్వర్‌ను తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ్నుంచి స్విమ్స్‌కు తరలించి చికిత్స అందించారు. అతడి ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో బుధవారం మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు తిరుచానూరు ఎస్‌ఐ వీరేష్‌ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.  

Updated Date - 2021-10-28T06:38:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising