ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చివరి మజిలీకి ఎంత కష్టం!

ABN, First Publish Date - 2021-10-18T06:48:49+05:30

అంతిమ సంస్కారానికి నడుములోతు నీళ్లలో.. కాలువ దాటాల్సిన పరిస్థితి నెలకొంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అంతిమ సంస్కారానికి నడుములోతు నీళ్లలో.. కాలువ దాటాల్సిన పరిస్థితి నెలకొంది. నాగలాపురం మండలం సురుటుపల్లె పంచాయతీ కస్తూరినాయుడు కండ్రిగలో శారదమ్మ(90) ఆదివారం మృతి చెందారు. ఈమె అంతిమయాత్రకు బంధువులు, కుటుంబ సభ్యులు నానా కష్టాలు పడ్డారు. ఈ గ్రామంలో 150 కుటుంబాలున్నాయి. ఎవరైనా మరణిస్తే సమీపంలోని అరుణానది ఒడ్డున దహన సంస్కారాలు చేస్తారు. గ్రామం నుంచి శ్మశానానికి వెళ్లే దారిలో కాలువ దాటాలి. ప్రస్తుతం కాలువ ఉధృతంగా ప్రవహిస్తుండటంతో నడుంలోతు నీళ్లలో ఈదుకుంటూ మృతదేహాన్ని మోసుకెళ్లారు. ఎన్నాళ్లుగానో ఇదే పరిస్థితి. కాలువపైన కాజ్‌వే నిర్మించాలని ఏళ్ల తరబడిగా ప్రజాప్రతినిధులకు, అధికారులకు విన్నవిస్తూనే ఉన్నారు. వాళ్లు సరే అంటున్నారే గానీ సమస్య మాత్రం పరిష్కారం కావడంలేదు. 

- సత్యవేడు


Updated Date - 2021-10-18T06:48:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising