ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బయ్యారెడ్డి చెరువుకు గండి

ABN, First Publish Date - 2021-11-27T06:03:33+05:30

మండలంలోని పత్తేగడ గ్రామానికి చెందిన పాలెం కురవ పల్లె సమీపంలోని బయ్యారెడ్డి చెరువుకు గండి పడటంతో చెరువు కట్ట పరిస్థితి ఆందోళనకరంగా మారింది.

బయ్యారెడ్డి చెరువు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలికిరి, నవంబరు 26: మండలంలోని పత్తేగడ గ్రామానికి చెందిన పాలెం కురవ పల్లె సమీపంలోని బయ్యారెడ్డి చెరువుకు గండి పడటంతో చెరువు కట్ట పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఎంపీడీవో వెంక టేశులు, డీటీ సుబ్బయ్య, ఏఈ డమరుకం, సచివాలయ ఇంజినీరింగ్‌ అసిస్టెంట్లు గండి పూడ్చడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసినా చీకటి పడటంతో పనులు కొనసాగలేదు. బయ్యారెడ్డి చెరువు ఆయకట్టు మర్రికుంటపల్లె గ్రామ పరిధిలో ఉంది. ఈ చెరువుకు ప్రమాదం జరిగితే మర్రికుంటపల్లె, మేడికుర్తి గ్రామాలకు ముప్పు తప్పదంటున్నారు. అలాగే కొత్తగజ్జలవారిపల్లెలోని 250 ఇళ్లు మునిగిపోవడం ఖాయమని అంటున్నారు. బయ్యారెడ్డి చెరువు తెగితే ఆ వరద కొమ్మేపల్లె చెరువుకు చేరి ఆ చెరువు తెగిపోవచ్చని అదే జరిగితే కొమ్మేపల్లె, చెరువుముందర కురవపల్లె, మేడుకుర్తి ప్రమాదంలో పడుతాయని ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే భయ పడాల్సిన అవసరం లేదని బయ్యారెడ్డి చెరువుకు పడిన గండిని శనివారం పూడ్చివేస్తామని జలవనరుల శాఖ ఏఈ డమరుకం చెప్పారు.  

Updated Date - 2021-11-27T06:03:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising