రెడ్డెమ్మకు ప్రత్యేక పూజలు
ABN, First Publish Date - 2021-07-26T06:16:40+05:30
గుర్రంకొండ మండలంలోని చెర్లోపల్లెలో కొలువైన రెడ్డెమ్మ కొండ ఆలయంలో ఆదివారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
విశేష అలంకరణలో రెడ్డెమ్మ
గుర్రంకొండ, జూలై 25: గుర్రంకొండ మండలంలోని చెర్లోపల్లెలో కొలువైన రెడ్డెమ్మ కొండ ఆలయంలో ఆదివారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారు సంతానలక్ష్మిగా ప్రసిద్ధి చెందారు. దీంతో మన జిల్లా నుంచేగాక బయట ప్రాంతాల నుంచి మహిళా భక్తులు వచ్చారు. సంతానం లేనివారు సంతానం కోసం ఆకు పసురును తాగి ఆలయంలో వరపడ్డారు. అమ్మవారి కృపతో సంతానం పొందిన మహిళలు మొక్కులు తీర్చుకోవడానికి అధికంగా వచ్చారు. ఆలయ పరిసరాలు భక్తులతో రద్దీగా మారాయి.
Updated Date - 2021-07-26T06:16:40+05:30 IST