ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కన్నుల పండువగా హనుమంత వాహన సేవ

ABN, First Publish Date - 2021-04-22T06:41:00+05:30

శ్రీరామనవమి సందర్భంగా తిరుమలలో బుధవారం హనుమంత వాహన సేవ కన్నుల పండువగా జరిగింది.

హనుమంత వాహనంపై విహరిస్తున్న శ్రీరామచంద్రమూర్తి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): శ్రీరామనవమి సందర్భంగా తిరుమలలో బుధవారం హనుమంత వాహన సేవ కన్నుల పండువగా జరిగింది. శ్రీరామనవమిని పురస్కరించుకుని ఉదయం తొమ్మిది నుంచి 11 గంటల వరకు సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయస్వామికి శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపలో స్నపన తిరుమంజనం జరిగింది. రాత్రి ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు హనుమంత వాహనసేవ నిర్వహించారు. శ్రీరామచంద్రమూర్తి అవతారంలో శ్రీవారు హనుమంతుడిపై కొలువుదీరి నాలుగుమాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. తర్వాత శ్రీవారి ఆలయంలోని బంగారువాకిలి వద్ద శ్రీరామనవమి ఆస్థానాన్ని శాస్ర్తోక్తంగా నిర్వహించారు. కాగా, గురువారం సాయంత్రం ఐదు గంటలకు వైభోత్సవ మండపంలో సహస్రదీపాలంకరణ సేవ, రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది గంటల మధ్యలో బంగారువాకిలి వద్ద అర్చకులు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవాన్ని నిర్వహించనున్నారు.

Updated Date - 2021-04-22T06:41:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising