ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా!

ABN, First Publish Date - 2021-06-17T05:01:00+05:30

ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే కరోనా కేసులు పెరిగాయంటూ శ్రీకాళహస్తిలో టీడీపీ నాయకులు ఆందోళన నిర్వహించారు.

శ్రీకాళహస్తి రెవెన్యూ కార్యాలయం వద్ద టీడీపీ నిరసన
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాళహస్తి, జూన్‌ 16: ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే కరోనా కేసులు పెరిగాయనీ, కొవిడ్‌ బాధితులను ఆదుకోవాలని టీడీపీ నాయకులు డిమాండ్‌ చేశారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పిలుపు మేరకు బుధవారం స్థానిక రెవెన్యూ కార్యాలయం వద్ద టీడీపీ నాయకులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ... ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరైన సౌకర్యాల్లేక జనం చనిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఏపీకి 65లక్షల టీకా డోసులు పంపిణీ చేయగా, 26 లక్షలు వినియోగించి మిగిలినవి వృథా చేశారని విమర్శించారు. కరోనా మృతుల దహనక్రియలకు రూ.15వేల సాయం కూడా పేద కుటుంబాలకు అందడం లేదని ఆరోపించారు. కరోనా మందులు, ఆక్సిజన్‌ను బ్లాక్‌ మార్కెట్‌లో విక్రయిస్తున్న వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గాలి చలపతి నాయుడు, నాయకులు విజయకుమార్‌, కామేష్‌ యాదవ్‌, పీఆర్‌ మోహన్‌, చక్రాల ఉష, ప్రమీలమ్మ, కంఠా రమేష్‌, మిన్నల రవి, ప్రసాదరావు, జిలానీబాషా, సుబ్బయ్య పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-17T05:01:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising