ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీసీలకు బంగారుబాట

ABN, First Publish Date - 2021-12-08T06:09:31+05:30

రాష్ట్రంలో వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి బంగారుబాట వేసిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని కృష్ణ బలిజ, పూసల అభివృద్ధి కార్పొరేషన్‌ రాష్ట్ర చైర్‌పర్సన్‌ కోలా భవాని పేర్కొన్నారు.

ఎమ్మెల్యే నవాజ్‌బాషాతో కలసి మీడియాతో మాట్లాడుతున్న చైర్‌పర్సన్‌ కోలా భవానీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణబలిజ, పూసల కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ భవాని


మదనపల్లె, డిసెంబరు 7: రాష్ట్రంలో వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి బంగారుబాట వేసిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని కృష్ణ బలిజ, పూసల అభివృద్ధి కార్పొరేషన్‌ రాష్ట్ర చైర్‌పర్సన్‌ కోలా భవాని పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఎం.నవాజ్‌బాషా స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ... 139 బీసీ ఉపకులాలను కలపి 56 కార్పొరేషన్లు, అందులో 28మంది మహిళలకు సీఎం అవకాశం కల్పించారన్నారు. బీసీ కుల జన గణనకు అసెంబ్లీలో తీర్మానం చేసి, పార్లమెంటుకు పంపడంపై కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే ఎం.నవాజ్‌బాషా మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పించామన్నారు. మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ జింకా వెంకటాచలపతి, జడ్పీటీసీ సభ్యుడు డి.ఉదయ్‌కుమార్‌, కోలా మణికంఠ, దండు రామాంజులు, శీలం రమేష్‌, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-08T06:09:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising