ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మీరే మా రియల్‌ హీరో

ABN, First Publish Date - 2021-06-15T05:59:44+05:30

మీరే రియల్‌..

ఎన్‌.కొత్తపల్లె వైద్యాధికారులకు చంద్రబాబు లేఖలందిస్తున్న టీడీపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు చంద్రబాబు లేఖలు


కుప్పం(చిత్తూరు): కరోనా విపత్కర సమయంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సేవలందించిన ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు స్థానిక ఎమ్మెల్యే, ప్రతిపక్ష నేత, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు లేఖలు పంపారు. ‘మీరే మా రియల్‌ హీరో, మీకు సెల్యూట్‌’ అంటూ వారి సేవలను ప్రశంసించారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోని వైద్య, మున్సిపల్‌, పోలీసు సిబ్బందికి చంద్రబాబు పంపిన లేఖలను టీడీపీ నాయకులు సోమవారం అందజేసి చంద్రబాబు తరఫున ధన్యవాదాలు తెలిపారు. చంద్రబాబు లేఖల్లోని సారాంశమిదీ..‘కరోనా నుంచి ప్రజల ప్రాణాలు కాపాడేందుకు మీరు చేస్తున్న పోరాటం, మీరు పడుతున్న ఆరాటం చూసి దేశమంతా చేతులెత్తి మొక్కుతోంది. ప్రస్తుతం మనం మన జీవితకాలంలో గతంలో ఎన్నడూ చూడని ప్రమాదకర విపత్తును ఎదుర్కొంటున్నాం. కరోనా మొదటి దశ నుంచి ఇప్పటి వరకు ఎన్నడూ చూడని ప్రమాదకర విపత్తును ఎదుర్కొంటున్నాం.


కరోనా మొదటి దశనుంచి ఇప్పటి వరకు మీరు నిస్వార్థంగా, మానవతా దృక్పథంతో ప్రజలకు సేవలందిస్తున్న తీరు అనిర్వచనీయం. మీ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా, కుటుంబానికి దూరంగా వుంటూ, ప్రతిరోజూ విపత్తుపై మీరు చేస్తున్న పోరాటం ఎంత కఠినంగా ఉంటుందో, ఎంత ప్రమాదకరంగా ఉంటుందో మేము ఊహించగలం. ఈ సమయంలో మీరు ప్రదర్శిస్తున్న ధైర్య సాహసాలు అసాధారణం, ఆదర్శనీయం, అభినందనీయం. ప్రజల ప్రాణాలు కాపాడే క్రమంలో మరియు ఈ విపత్కర పరిస్థితుల్ల మీ ప్రాణాలు సైతం లెక్క చెయ్యకుండా ప్రజా సేవ కోసం మీ విధులు నిర్వహిస్తున్న క్రమంలో మీరు మీ ఆప్తులను ఎంతగా కోల్పోతున్నారో, ఎందరిని కోల్పోయారో ! ఆ ఆత్మీయతను మీకు మళ్లీ తెచ్చి ఇచ్చేందుకు ఒక్క ‘కృతజ్ఞత’ అన్నమాట సరిపోదు. కరోనా సోకితే అయిన వాళ్లే దగ్గరకు రాకుండా వదిలేసి వెళ్తున్న పరిస్థితుల్లో మీరు మాత్రం సొంత మనుషుల్లా చేరదీసి సేవలందిస్తున్నారు. అసలు మీరు చేస్తున్న సేవలకు కృతజ్ఞత అనే పదం కూడా చాలా చిన్నది. మాకోసం మీరు చేస్తున్న త్యాగాలకు ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాము. ఆ దేవుడు మిమ్మల్ని ఆరోగ్యంగా దీవించి రక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’ అంటూ చంద్రబాబు లేఖను ముగించారు.



Updated Date - 2021-06-15T05:59:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising