ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గణతంత్ర దినోత్సవంనాడే స్వాతంత్య్ర సమరయోధుడి మృతి

ABN, First Publish Date - 2021-01-27T05:33:03+05:30

గణతంత్ర దినోత్సవమైన మంగళవారం స్వాతంత్య్ర సమరయోధుడు మృతిచెందారు. తిరుమల గాంధీగా పేరుగాంచిన నైనప్పగారి సుబ్బయ్యశెట్టి తిరుపతి నగరం కోదండరామస్వామి ఆలయం సమీపంలోని స్వగృహంలో కన్నుమూశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి(పద్మావతినగర్‌), జనవరి 26: గణతంత్ర దినోత్సవమైన మంగళవారం స్వాతంత్య్ర సమరయోధుడు మృతిచెందారు. తిరుమల గాంధీగా పేరుగాంచిన నైనప్పగారి సుబ్బయ్యశెట్టి తిరుపతి నగరం కోదండరామస్వామి ఆలయం సమీపంలోని స్వగృహంలో కన్నుమూశారు. ఈయన 1925 ఆగస్టు 5వ తేదీన జన్మించారు. స్వాతంత్య్ర ఉద్యమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పీవీ నరసింహారావు మొదలుకుని ఎంతోమంది ప్రముఖ నేతలకు సన్నిహితంగా ఉండేవారు. వారు తిరుపతి, తిరుమలకు వచ్చినపుడు తిరుమల గాంధీని కలుసుకుని గౌరవించేవారు. స్వాతంత్య్ర సమర యోధుడైన ఆయన గణతంత్ర దినోత్సవంనాడే మృతిచెందడం విశేషం. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు ఆయనకు నివాళులర్పించారు. గోవిందధామంలో ఆయన అంత్యక్రియలు జరిగాయి. 

Updated Date - 2021-01-27T05:33:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising