ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుండెపోటుతో తమిళనాడు మాజీ మంత్రి విజయసారథి మృతి

ABN, First Publish Date - 2021-07-08T06:30:57+05:30

తమిళనాడు మాజీ మంత్రి విజయసారథి (65) బుధవారం గుండెపోటుతో మృతి చెందారు. తమిళనాడు రాష్ట్రం అరక్కోణంకు చెందిన విజయసారథి 1982లో దివంగత తమిళ సీఎం ఎం.జీ.రామచంద్రన్‌ కేబినెట్‌లో వ్యవసాయశాఖ మంత్రిగా పనిచేశారు.

విజయసారథి (ఫైల్‌)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సత్యవేడు, జూలై7: తమిళనాడు మాజీ మంత్రి విజయసారథి (65) బుధవారం గుండెపోటుతో మృతి చెందారు. తమిళనాడు రాష్ట్రం అరక్కోణంకు చెందిన విజయసారథి 1982లో దివంగత తమిళ సీఎం ఎం.జీ.రామచంద్రన్‌ కేబినెట్‌లో వ్యవసాయశాఖ మంత్రిగా పనిచేశారు. ఎంజీఆర్‌ మరణానంతరం అక్కడి ద్రవిడ రాజకీయాల్లో ఇమడలేక సత్యవేడులోని రాంనగర్‌లో నివాసం ఏర్పరుచుకున్నారు. సత్యవేడు మాజీ ఎమ్మెల్యే హేమలతకు రాజకీయ గురువుగా మారారు. హేమలత ఎంపీపీ నుంచి ఎమ్మెల్యే వరకు రాజకీయాలలో ఉన్నత స్థానానికి ఎదగడంలో తెర వెనుక విజయసారథి పాత్ర ప్రముఖంగా ఉంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీచేసేందుకు టికెట్‌ రేసులో ఉన్నారని వార్తలు కూడా వెలువడ్డాయి. నియోజకవర్గంలో అన్ని పార్టీల నాయకులందరితో ఆయనకు మంచి పరిచయాలు ఉన్నాయి. కాగా విజయసారథి అవివాహితులు. ఆయనకు ఇద్దరు సోదరులు, ఒక సోదరి ఉన్నారు.  ఆయన నివాస గృహంలోఉదయం దినపత్రికలు చదువుతుండగా గుండె పోటు వచ్చింది. గమనించిన ఆయన అనుచరులు వెంటనే  సత్యవేడు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. విజయసారథి మృతిపట్ల డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఎమ్మెల్యే ఆదిమూలం ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. ఆయన అంత్యక్రియలు గురువారం తమిళనాడు అరక్కోణంలో జరగనున్నట్లు ఆయన అభిమానులు తెలిపారు.

Updated Date - 2021-07-08T06:30:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising