ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీ అనుకుంటే జగన్...కేసీఆర్ జైలుకే: గోనె ప్రకాష్‌రావు

ABN, First Publish Date - 2021-06-18T18:46:30+05:30

బీజేపీ అనుకుంటే కేసీఆర్, జగన్ జైలుకెళతారని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి: బీజేపీ అనుకుంటే కేసీఆర్, జగన్ జైలుకెళతారని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ బెయిల్ రద్దవుతుందని తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ నేతలు మాట్లాడారని... బెయిల్ రద్దు అయితే జైలుకే కదా వెళ్ళాల్సింది అని అన్నారు. కేసీఆర్‌పై రెండు ఈడీ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని గుర్తుచేశారు.  ఎక్కడైనా ఈ మాటలు మాట్లాడుతానని తెలిపారు. కొందరు ఫోన్లు చేసి కవ్వింపులకు పాల్పడుతున్నారని అన్నారు. ఈ మాటలు ఎక్కడైనా మాట్లాడుతానంటూ కవ్వింపులకు పాల్పడే వారికి ఆయన సవాల్ విసిరారు.  గోనెనన్ను గెలికితే  అందరి బండారాలు పురాణాలుగా బయట పెడుతా అని హెచ్చరించారు.


ప్రజాస్వామ్య దేశంలో 124ఎ చట్టం అవసరం లేదన్నారు.  అది రాచరిక కాలం నాటి చట్టమని... ఇప్పుడు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామని తెలిపారు. ఇక్కడ ఆ చట్టం అవసరం లేదన్నారు. విజయమ్మ రాసిన నాలో నాతో వైఎస్‌ఆర్ పుస్తకంలో 172 పేజిలో తప్పులు రాసారని చెప్పారు. జగన్... వైఎస్ పాదయాత్రలో సంఘీభావంగా ఉన్నారని అబద్దాలు రాశారన్నారు. అది తప్పుల తడక అని వ్యాఖ్యానించారు. వైఎస్ పాదయాత్ర జరిగినన్ని రోజులు అంబటి, లగడపాటి, భూమన కరుణాకర్ రెడ్డి, సుధీర్ రెడ్టిలు ఉన్నారన్నారు. జగన్ ఎక్కడా వైఎస్ పాదయాత్రలో పాల్గొనలేదన్నారు. అది నిజమని నిరూపిస్తే తిరుపతిలో ఉరేసుకుంటా అంటూ వైఎస్ఆర్, జగన్ అభిమానులకు అని సవాల్ విసిరారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలిగా ఉండి షర్మిల దీక్షకు ఎలా మద్దతు తెలుపుతారని ప్రశ్నించారు. ప్రత్యక్షంగా దీక్షలో ఎలా పాల్గొంటారన్నారు. వైఎస్‌ విజమ్మకు, వైఎస్ జగన్ ఎందుకు షోకాజ్ నోటీసు ఇవ్వలేదని గోనె ప్రకాష్‌రావు ప్రశ్నించారు. 

Updated Date - 2021-06-18T18:46:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising