ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతుల బాగోగులను వైసీపీ సర్కార్ గాలికొదిలేసింది: అమర్నాథ్

ABN, First Publish Date - 2021-09-13T17:01:15+05:30

వైసీపీ ప్రభుత్వం రైతుల బాగోగులు గాలికి వదిలేసిందని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు:  వైసీపీ ప్రభుత్వం రైతుల బాగోగులు గాలికి వదిలేసిందని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి విమర్శించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ సబ్సీడీ రుణాలు లేవని, నీటి కాలువల పూడికతీత పనులు చేపట్టలేదన్నారు. చెరువులు గురించి పట్టించుకోవడం లేదన్నారు. వ్యవసాయ శాఖ కార్యాలయాలు మూసేసినట్టు అనుమానం కలుగుతోందని తెలిపారు. విద్యుత్ చార్జీలు పెంచమని ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిన వైసీపీ ఇప్పుడు ఎలా పెంచుతున్నారో అర్థం చేసుకోవచ్చన్నారు. గడిచిన  రెండున్నరేళ్లలో పలు ధపాలుగా 9,069 కోట్లు పెంచారని అన్నారు. ఐదేళ్ల టీడీపీ హాయాంలో ఒక్క పైసా పెంచలేదని ఆయన గుర్తుచేశారు. తెస్తున్న వేల కోట్లాది అప్పులు ఏంచేస్తున్నారని ప్రశ్నించారు. విపరీతంగా భారాన్ని ప్రజలు పై  మోపుతున్నారని మండిపడ్డారు. వ్యవసాయానికి మీటర్లు పెట్టి రైతు ఆత్మహత్యలను పెంచే ప్రయత్నం తప్ప ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. నీటి, విద్యుత్ పంపకాల వ్యవహారంలో  కేసీఆర్, జగన్ కలిసి నాటకాలాడుతున్నారని వ్యాఖ్యానించారు. ఏపీకి అన్యాయం జరుగుతూ ఉంటే ఒకే ఇంట్లోని ఇద్దరు జగన్మోహన్ రెడ్డి, షర్మిలమ్మ నాటకాలు ఆడుతున్నారని అమర్నాథ్ రెడ్డి విరుచుకుపడ్డారు. 

Updated Date - 2021-09-13T17:01:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising