ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చంద్రబాబు ఇంటిపై అధికార పార్టీ దాడిని ఖండిస్తున్నా: చింతామోహన్

ABN, First Publish Date - 2021-09-18T18:34:24+05:30

టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటిపై అధికార పార్టీ దాడిని ఖండిస్తున్నానని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడు చింతా మోహన్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి: టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటిపై అధికార పార్టీ దాడిని ఖండిస్తున్నానని కేంద్ర మాజీ మంత్రి,  కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడు చింతా మోహన్ అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీలను గౌరవించినప్పుడే అధికార పార్టీ గౌరవం నిలబడుతుందన్నారు. ఏపీ పీసీసీ ప్రెసిడెంట్ మార్పు విషయంలో పార్టీ ఆలోచన చేస్తుందని, ప్రజా ఆమోదయోగ్యమైన నాయకుడి కోసం వెతుకుతున్నట్లు చెప్పారు. దీపావళి తరువాత కొత్త పీసీసీ ఎంపిక ఉంటుందని ఆయన తెలిపారు. 

  




కాగా... రాష్ట్రంలో అస్తవ్యస్తమైన పరిపాలన సాగుతోందని విమర్శించారు. డ్రగ్స్, గంజాయి యదేచ్ఛగా రవాణా సాగుతుందన్నారు. మహిళలు, బాలికపై లైంగిక దాడులు పెరుగుతున్నాయని తెలిపారు.  రాష్ట్రంలో నిరుద్యోగం వలనే ఇలాంటివి సంభవిస్తున్నాయని చెప్పారు. ఉద్యోగాలు లేక యువత చీప్ కోటర్ కొట్టి, గంజాయి తాగి రోడ్డులపై వీరంగం స్పష్టిస్తున్నారని మండిపడ్డారు. సినిమా వాళ్ళు డ్రగ్స్ కొడుతున్నారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా చూపడం అవసరమా అని ప్రశ్నించారు. వీలైతే డ్రగ్స్, గంజాయి సరఫరా అయ్యే చోటును నిర్మూలనం చేసే సత్తా ప్రభుత్వానికి లేదన్నారు. రాజకీయాల్లో బెగ్గర్స్ బిలీనీయర్స్ అవుతున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రజలు పేదరికంతో బతుకుతుంటే నాయకులు ప్రత్యేక విమానాల్లో తిరుగుతున్నారన్నారు. తీహార్ జైలుకు వెళ్ళి వచ్చిన వాళ్ళుకు కూడా టీటీడీ బోర్డులో చోటు కల్పించడం సిగ్గు చేటని చింతామోహన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 

Updated Date - 2021-09-18T18:34:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising