ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పతనమైన టమోటా ధరలు

ABN, First Publish Date - 2021-05-17T05:55:47+05:30

భారీ పెట్టుబడులతో సాగు చేస్తున్న టమోటా పంట ఆశించిన స్థాయిలో దిగుబడి వస్తున్నా ధరలు లేక పోవడంతో రైతులు నష్ట పోతున్నారు. పండిన టమోటా కోత కూలీ, మార్కెట్‌కు తరలించే అద్దె కూడా చేతికి రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ధరల పతనంతో కోయకుండా వదిలేసిన టమోటా పంట
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దిగుబడి ఉన్నా ధరల్లేక రైతుల గగ్గోలు


బి.కొత్తకోట, మే 16: భారీ పెట్టుబడులతో సాగు చేస్తున్న టమోటా పంట ఆశించిన స్థాయిలో దిగుబడి వస్తున్నా ధరలు లేక పోవడంతో రైతులు నష్ట పోతున్నారు. పండిన టమోటా కోత కూలీ, మార్కెట్‌కు తరలించే అద్దె కూడా చేతికి రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరాకు సుమారు లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టామని, ధరలు పతనం కావడంతో దిక్కుతోచని స్థితికి చేరుకున్నామని చెబుతున్నారు. గిట్టుబాటు ధర  లేక పోవడంతో పలువురు రైతులు పంటను పొలంలోనే వదిలేస్తున్నారు. మరికొంత మంది రైతులు  రేటు రఆకుండా పోతుందా అంటూ ఎదురు చూస్తున్నారు. అయితే మార్కెట్టులో కిలో టమోటా రూ.3 దాటడం లేదు. దీంతో పెట్టుబడికి చేసిన అప్పులు ఎలా తీర్చాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి గిట్టుబాటు ధర కల్పించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు. 


బి.కొత్తకోటలో మార్కెట్‌ ప్రారంభమైనా...


బి.కొత్తకోట మార్కెట్లో వారం క్రితం నాలుగు టమోటా మండీలు ప్రారంభమైనప్పటికీ వ్యాపా రులు రాకపోవడంతో  టమోటాలకు ధరలు లభిం చడం లేదు. తంబళ్లపల్లె నియోజకవర్గంలో సుమా రు ఐదు వేల ఎకరాల్లో టమోటా సాగు చేసినట్లు అధికార సమాచారం. ఈ ప్రాంతాల నుంచే కాకుండా కర్ణాటక సరిహద్దు గ్రామాల నుంచి కూడా బి.కొత్తకోట మార్కెట్‌కు టమోటాలు భారీగా వస్తు న్నాయి. అయితే వ్యాపారులు రాకపోవడంతో టమోటా సగం కూడా విక్రయించలేకపోతున్నారు. బి.కొత్తకోట మార్కెట్‌లో 15 కిలోల క్రేట్‌ ధర రూ.30 వరకు పలికింది. దీంతో పెట్టుబడి కూడా దక్కక పోవడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు.

Updated Date - 2021-05-17T05:55:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising