ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మానవత్వం చాటిన మాజీ మంత్రి అమర్‌

ABN, First Publish Date - 2021-11-29T04:06:04+05:30

రోడ్డుప్రమాదంలో తీవ్రంగా గాయడిన ఇద్దరు క్షతగాత్రులను అటువైపు వెళుతున్న మాజీ మంత్రి అమరనాథ రెడ్డి గుర్తించి తన వాహనంలో ఆస్పత్రికి తరలించి మానవత్వం చాటుకున్నారు.

గాయపడిన వారిని పరామర్శిస్తున్న మాజీమంత్రి అమర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

క్షతగాత్రులను తన వాహనంలో ఆస్పత్రికి తరలింపు


గంగవరం, నవంబరు28: రోడ్డుప్రమాదంలో తీవ్రంగా గాయడిన ఇద్దరు క్షతగాత్రులను అటువైపు వెళుతున్న మాజీ మంత్రి అమరనాథ రెడ్డి గుర్తించి తన వాహనంలో ఆస్పత్రికి తరలించి మానవత్వం చాటుకున్నారు. గంగవరం మండలం పత్తికొండకు చెందిన హర్నేష్‌(18), రాజేష్‌(18)లు ద్విచక్రవాహనంపై వస్తూ ముందు వెళుతున్న కారును ఢీకొనడంతో తీవ్రగాయాలై నడిరోడ్డుపై పడిపోయారు. వాహనదారులు గమనించి అంబులెన్స్‌కు ఫోన్‌ చేసి ఎదురుచూస్తున్నారు. ఇదే సమయంలో ఈ దారిలో వస్తున్న మాజీ మంత్రి అమర్‌ ప్రమాద ఘటనను చూసి వాహనాన్ని ఆపి క్షతగాత్రుల వివరాలు తెలుసుకొని వారి కుటుంబసభ్యులకు సమాచారం చేరవేశారు. ఎంతసేపటికీ అంబులెన్స్‌ రాకపోవడంతో అమరనాథ రెడ్డి చలించి తన వాహనంలో ఆస్పత్రికి పంపించారు. ఆమరనాఽథ రెడ్డి యువసేన సభ్యులు పార్ధసారధి, లోకేష్‌, సాధిక్‌లు క్షతగాత్రులను దగ్గరుండి ఆస్పత్రిలో చేర్పించి ప్రథమ చికిత్స అనంతరం వేలూరు సీఎంసీకి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉండడంతో అమరనాథ రెడ్డికి బాధిత కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈమేరకు గంగవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.



Updated Date - 2021-11-29T04:06:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising