ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంటపొలాల్లోకి ఏనుగులు...పరుగులు తీసిన రైతులు

ABN, First Publish Date - 2021-04-21T06:12:14+05:30

పలమనేరు మండలంలోని ఊసరపెంట సమీపంలోని పంటపొలాలపై మంగళవారం వేకువజామున మూడుగంటల ప్రాంతంలో విరుచుకుపడ్డాయి.

ధ్వంసమైన మామిడితోట
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పలమనేరు రూరల్‌,ఏప్రిల్‌ 20: పలమనేరు మండలంలోని ఊసరపెంట సమీపంలోని పంటపొలాలపై మంగళవారం వేకువజామున మూడుగంటల ప్రాంతంలో విరుచుకుపడ్డాయి. 11 ఏనుగులున్న గుంపు మామిడి, వరి, టమోటపంటలను నాశనం చేశాయి.  దాడుల్లో  గ్రామానికి చెందిన లావణ్య అనే రైతుకు చెందిన మామిడి, జయరామనాయుడు, చిన్నపాపమ్మలకు చెందిన వరి, బాబునాయుడుకు చెందిన టమోట పంటలను ఆరగించి తొక్కేశాయి. ఇదిలా ఉండగా గురువారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో రైతులు వ్యవసాయపొలాల్లో పనులు చేసుకొంటుండగా, పట్టపగలే పంటల్లోకి మళ్లీ ప్రవేశించాయి. దీంతో వారు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని పరుగులు తీశారు. ఆ తరువాత గ్రామస్తులందరూ ఏకమై ఏనుగుల గుంపును తరిమేందుకు ప్రయత్నించగా, అవి అక్కడ నుంచి అంగుళం కూడా కదలలేదు. పంటకోతదశకు వచ్చి చేతికందే సమయంలో ఏనుగులు నాశనం చేశాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి ఏనుగుల దాడుల నుంచి పంటలను రక్షించాలని, నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని అధికారుకు విజ్ఞప్తి చేశారు. 



Updated Date - 2021-04-21T06:12:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising