ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కౌండిన్యలో ఏనుగు మందల తిష్ట

ABN, First Publish Date - 2021-06-04T04:43:16+05:30

పలమనేరు మండలంలోని మొసలిమడుగు, కాలోపల్లె, మండిపేటకోటూరు, నూనేవారిపల్లె, మండిపేటకోటూరు, కృష్ణాపురం తదితర గ్రామాలు కౌండిన్య అభయారణ్యానికి అతిదగ్గరలో ఉండడంతో ప్రజలు నిత్యం ఏనుగుల ఘీంకారాలతో హడలిపోతున్నారు.

పిల్లఏనుగులతో రోడ్డుపై ఏనుగుల మంద
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 పిల్లలు ఉండడంతో సరిహద్దులు దాటని వైనం


 పలమనేరు రూరల్‌, జూన్‌3 : పలమనేరు మండలంలోని మొసలిమడుగు, కాలోపల్లె, మండిపేటకోటూరు, నూనేవారిపల్లె, మండిపేటకోటూరు, కృష్ణాపురం తదితర గ్రామాలు కౌండిన్య అభయారణ్యానికి అతిదగ్గరలో ఉండడంతో ప్రజలు నిత్యం ఏనుగుల ఘీంకారాలతో హడలిపోతున్నారు. లాక్‌డౌన్‌తో రోడ్లన్నీ బోసిపోయి వాహన రాకపోకల శబ్దాలు పూర్తిగా ఆగిపోవడంతో ఏనుగులు రోడ్లపైకి వస్తున్నాయి. 

 తమిళనాడు వైపు వెళ్లలేకపోతున్న ఏనుగులు

 తమిళనాడు ప్రాంతాల్లో చాలావరకు అడవికి నిప్పంటించడంతోపాటు అక్కడి ఏనుగుల రైడింగ్‌ చాలా క్రూరంగా ఉండడంతో తమిళనాడు సరిహద్దుల వైపు వెళ్లడానికి జంకుతున్నాయి. దీనికితోడు మన కౌండిన్య అభయారణ్యంలో దట్టమైన పచ్చని చెట్లు ఉండడంతో ఏనుగుల గుంపులు తమకు ఆవాసాలుగా మార్చుకుంటున్నాయి. 

 కౌండిన్యలో 50 ఏనుగులపైగా తిష్ట

ప్రస్తుతం కౌండిన్య అభయారణ్యంలో సుమారు 50 ఏనుగులకు పైగా తిష్టవేసినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఇవి గుంపులుగా విడిపోయి అటవీ సరిహద్దు ప్రాంత పొలాలు, మామిడి తోటలను ఆరగించి, తొక్కి నాశనం చేస్తున్నాయి. గత రెండు నెలల్లో ఏనుగుల గుంపుల్లో ఉన్న 9 ఏనుగులుపైగా ప్రసవించడంతో ముందుకు సాగలేకపోతున్నాయి. గురువారం మొసలమడుగు సమీపంలో దర్గావద్ద ఏనుగుల గుంపులు వెళ్తుండగా, ఆదే గ్రామానికి చెందిన  యువకులు సెల్‌ఫోన్‌లో బందిస్తుండగా, వెనుక మరో పిల్లఏనుగుల మంద తరుముకొంది. దీంతో యువకులు పరుగులు తీశారు.

Updated Date - 2021-06-04T04:43:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising