16న ఒక జడ్పీటీసీ, ఎనిమిది ఎంపీటీసీ స్థానాలకు ఎన్నిక
ABN, First Publish Date - 2021-11-14T06:00:31+05:30
జిల్లాలో ఒక జడ్పీటీసీ, ఎనిమిది ఎంపీటీసీ స్థానాలకు ఈ నెల 16న పోలింగ్ నిర్వహించనున్నట్లు ఆర్వో మురళి తెలిపారు.
చిత్తూరు కలెక్టరేట్, నవబరు 13: జిల్లాలో ఒక జడ్పీటీసీ, ఎనిమిది ఎంపీటీసీ స్థానాలకు ఈ నెల 16న పోలింగ్ నిర్వహించనున్నట్లు ఆర్వో మురళి తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణ కోసం 93 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, ఇందులో 44 సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించామన్నారు. బంగారుపాళ్యం జడ్పీటీసీ ఎన్నిక కోసమే 67 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం 117 మంది పీవోలు, 117 మంది ఏపీవోలు, 351 మంది పీవోలను నియమించినట్లు చెప్పారు. ఎన్నికల కోసం 15 రూట్లను గుర్తించినట్లు చెప్పారు. అలాగే 18న జరిగే ఓట్ల లెక్కింపు కోసం 32 టేబుళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్వో వివరించారు. ఇందుకోసం 37మంది కౌంటింగ్ సూపర్ వైజర్లు, 78 మంది కౌంటింగ్ అసిస్టెంట్లను ఎంపిక చేసి శిక్షణ ఇచ్చామన్నారు. బంగారుపాళ్యం జడ్పీటీసీ స్థానానికి అక్కడి స్థానానికి జడ్పీ హైస్కూల్‌లో కౌంటింగ్ కేంద్రంగా గుర్తించామని ఆర్వో చెప్పారు.
Updated Date - 2021-11-14T06:00:31+05:30 IST