ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మామిడి బోర్డు ఏర్పాటుకు కృషి

ABN, First Publish Date - 2021-06-20T06:24:55+05:30

మామిడికి గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు రైతుల కష్టాలను పరిష్కరించేందుకు మామిడి బోర్డు ఏర్పాటుకు కృషి చేస్తామని జిల్లా వ్యవసాయ సలహా సంఘం చైర్మన్‌ రామచంద్రారెడ్డి పేర్కొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న రామచంద్రారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిల్లా వ్యవసాయ సలహా సంఘం చైర్మన్‌


బంగారుపాళ్యం, జూన్‌ 19: మామిడికి గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు రైతుల కష్టాలను పరిష్కరించేందుకు మామిడి బోర్డు ఏర్పాటుకు కృషి చేస్తామని జిల్లా వ్యవసాయ సలహా సంఘం చైర్మన్‌ రామచంద్రారెడ్డి పేర్కొన్నారు.  శనివారం బంగారుపాళ్యం మండలం పాలేరు గ్రామంలో మామిడి రైతులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సలహా సంఘం చైర్మన్‌ మాట్లాడుతూ ఏటా మామిడికి గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. మామిడి పంట బీమా వర్తించేలా చర్యలు తీసుకుంటామన్నారు. మామిడి రైతుల సమస్యలను రాజకీయ కోణంలో చూడటం బావ్యం కాదన్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గుజ్జుపరిశ్రమ యజమనులతో కలసి ధరలను నియంత్రిస్తున్నారని ఆరోపించడం తగదన్నారు. ఈ కార్యక్రమంలో రైతు నాయకులు శిరీష్‌రెడ్డి, ప్రవీణ్‌రెడ్డి, దొరస్వామి, ప్రభుచౌదరి, సుబ్రహ్మణ్యం, రవీంద్రనాథ్‌, శివయ్య, తోటాశ్రీహరి, అరుణమలరెడ్డి, సోమశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-20T06:24:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising