ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్టీసీ అభ్యున్నతికి కృషి

ABN, First Publish Date - 2021-10-23T07:04:00+05:30

ఏపీ ఆర్టీసీ అభ్యున్నతికి కృషి చేస్తానని నెల్లూరుజోన్‌ చైర్‌పర్సన్‌ బి.సుప్రజారెడ్డి తెలిపారు.

అలిపిరి గ్యారేజీ ఆవరణలో మొక్క నాటుతున్న సుప్రజారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు జోన్‌ చైర్‌పర్సన్‌ సుప్రజారెడ్డి


తిరుపతి(కొర్లగుంట), అక్టోబరు 22: ఏపీ ఆర్టీసీ అభ్యున్నతికి కృషి చేస్తానని నెల్లూరుజోన్‌ చైర్‌పర్సన్‌ బి.సుప్రజారెడ్డి తెలిపారు. చైర్‌పర్సన్‌ హోదాలో తొలిసారిగా శుక్రవారం ఆమె తిరుపతి పర్యటనకు వచ్చారు. ఉదయం మంగళం డిపోను సందర్శించారు. ప్రయాణికులు, ఉద్యోగుల సదుపాయాలను పరిశీలించారు. అనంతరం అలిపిరి డిపోకు చేరుకున్న ఆమె గ్యారేజీ ఆవరణలో మొక్కలు నాటారు. హెవీ డ్రైవింగ్‌ లైసెన్స్‌ శిక్షణ తరగతులను పరిశీలించారు. అలిపిరి డిపోకు సంబంధించి టీటీడీకి చెల్లిస్తున్న అద్దె భారాన్ని అధికారులు ఆమె దృష్టికి తీసుకురాగా.. ప్రభుత్వం, టీటీడీ ఉన్నతాధికారులతో చర్చిస్తామని చెప్పారు. అనంతరం తిరుపతి సెంట్రల్‌ బస్సుస్టేషన్‌లో తనిఖీలు చేశారు. ఆర్టీసీ కల్పిస్తున్న సౌకర్యాలు ఎలా ఉన్నాయంటూ ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. గ్యారేజ్‌లో సిబ్బంది, కార్మికులతో మాట్లాడారు. అతిపెద్ద సంస్థ అయిన ఆర్టీసీలో తాను కూడా ఒక భాగమైనందుకు సంతోషంగా ఉందన్నారు. హెవీడ్రైవింగ్‌ శిక్షణ తరగతుల నిర్వహణ చాలా బాగుందన్నారు. ఆమెతోపాటు నెల్లూరు జోన్‌ ఆర్టీసీ ఈడీ గోపీనాథ్‌రెడ్డి, తిరుపతి ఆర్‌ఎం చెంగల్‌రెడ్డి, డిప్యూటీ సీటీఎం మధుసూదన్‌, సీటీఎం శ్రీనివాసరావు, ఏటీఎం విశ్వనాథ్‌, డిపో మేనేజర్లు మద్దిలేటి, ప్రవీణ్‌కుమార్‌, రాజవర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-23T07:04:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising