ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సామాన్యులపై భారం: కాంగ్రెస్‌

ABN, First Publish Date - 2021-04-11T06:51:07+05:30

ప్రజల రక్తం తాగుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తిరుపతి ఉప ఎన్నికల ద్వారా బుద్ధిచెప్పాలని రాష్ట్ర కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి అన్నారు.

మాట్లాడుతున్న తులసీరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాళహస్తి అర్బన్‌, ఏప్రిల్‌ 10: ప్రజల రక్తం తాగుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తిరుపతి ఉప ఎన్నికల ద్వారా బుద్ధిచెప్పాలని రాష్ట్ర కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి అన్నారు. పట్టణ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీ మండ్రకప్ప పాత్రపోషిస్తూ ప్రజలను పీడిస్తున్నారన్నారు. పెట్రోలు, డీజిల్‌, గ్యాస్‌ ధరలు పెంచి సామాన్యులపై భారం మోపుతున్నారని ఆరోపించారు. సీఎం జగన్‌ తేలుకొండిలా నిత్యం ప్రజలను కాటేస్తున్నారన్నారు. నూతన ఇసుక విధానంతో రాష్ట్రంలో భవన నిర్మాణరంగం నాశనమైపోయిందన్నారు. జగన్‌ అసమర్థపాలనతో ఇసుక బంగారమై కేజీలలో కొనాల్సి వస్తోందన్నారు. రాబోయే రోజుల్లో జుట్టు, గడ్డం పెంచినా, గుండు గీయించుకున్నా పన్ను చెల్లించాల్సి వస్తుందేమోనని ఎద్దేవా చేశారు. శ్రీకాళహస్తి రాహు-కేతు సర్పదోష నివారణ పూజలకు నిలయమన్నారు. అలాగే దేశానికి బీజేపీ శనిలాంటిదనీ, వైసీపీ, టీడీపీ కేతువులని విమర్శించారు. కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శి బత్తెయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-11T06:51:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising