ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ వైఫల్యం వల్లే..

ABN, First Publish Date - 2021-05-12T07:11:25+05:30

తిరుపతి రుయాస్పత్రి ఘటనకు ప్రభుత్వ వైఫల్యం.. అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ ప్రతిపక్షాలు మండిపడ్డాయి. కారకులైన వారిపై చర్యలు చేపట్టాలని నేతలు డిమాండు చేశారు.

రుయా వద్దమాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ అరెస్టు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రుయా ఘటనపై ప్రతిపక్షాల ఆందోళన.. అరెస్టు 


తిరుపతి(జీవకోన), మే 11: తిరుపతి రుయాస్పత్రి ఘటనకు ప్రభుత్వ వైఫల్యం.. అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ ప్రతిపక్షాలు మండిపడ్డాయి. కారకులైన వారిపై చర్యలు చేపట్టాలని నేతలు డిమాండు చేశారు. ఆక్సిజన్‌ అందక సోమవారం రాత్రి 11 మంది కరోనా బాధితులు మృతి చెందిన విషయం తెలిసిందే. దీనికి నిరసనగా మంగళవారం ఆస్పత్రి వద్ద టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయులు, నాయకులు ధర్నా చేశారు. నగరి మండలం అయినంబాకం (ఆయన స్వగ్రామం) నుంచి మంగళవారం ఉదయం తిరుపతికి బయలుదేరిన సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణను నగరిలోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తిరిగి అయినంబాకం గ్రామానికే తరలించి గృహ నిర్బంధంలో ఉంచారు. 


రుయాకు ఎంపీ,ఎమ్మెల్యే,మేయర్‌

 రుయాస్పత్రిని మంగళవారం ఉదయం ఎంపీ గురుమూర్తి,ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి,  మేయర్‌ శిరీష సందర్శించారు.ఆక్సిజన్‌ ప్లాంటును, సంఘటన జరిగిన వార్డులను సందర్శించాక వైద్యాధికారులతో మాట్లాడారు.అందరూ సంయమనం పాటించాలని,రాజకీయ ప్రయోజనాల కోసం ఈ ఘటనను వాడుకోరాదని సూచించారు.




Updated Date - 2021-05-12T07:11:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising