ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సోషల్‌ మీడియాలో దుష్ప్రచారాలు చేయొద్దు

ABN, First Publish Date - 2021-01-19T07:21:02+05:30

దర్గాలో జరిగిన ఘటనపై సోషల్‌ మీడియా వేదికగా అసత్య, దుష్ప్రచారాలు చేయొద్దని ఎస్పీ సెంథిల్‌కుమార్‌ హెచ్చరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దర్గా ఘటన కేసు దర్యాప్తునకు మూడు బృందాలు

ఎస్పీ సెంథిల్‌కుమార్‌


చిత్తూరు, జనవరి 18: గంగవరం మండలం మండలం దండపల్లె పంచాయతీ నాగిరెడ్డిపల్లె సమీపంలోని సయ్యద్‌ షాహి జిలానీ వల్లీ బాబా దర్గాలో ఈ నెల 16వ తేదీన జరిగిన ఘటనపై సోషల్‌ మీడియా వేదికగా అసత్య, దుష్ప్రచారాలు చేయొద్దని ఎస్పీ సెంథిల్‌కుమార్‌ హెచ్చరించారు. ఈ కేసు దర్యాప్తునకు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని ఒక ప్రకటన విడుదల చేశారు. ‘దర్గాలోకి గుర్తు తెలియని దుండగులు చొరబడి మజార్‌పై వేసి తీసిన చద్దర్లు, కొన్ని పాత వస్తువులను కాల్చివేశారు. దీనిపై నిర్వాహకులు ఇచ్చిన ఫిర్యాదుపై గంగవరం పోలీసులు కేసు కట్టారు. ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేయడానికి మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. ఈ పరిస్థితుల్లో దుష్ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. దేవాలయాలు, మసీదులు, చర్చిల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సమైక్య పేరుతో స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నాం. 1113 మంది రౌడీ షీటర్లపై బైండోవర్‌ కేసులను నమోదు చేశాం. ప్రార్థనాలయాల వద్ద ఎవరైనా అనుమానాస్పదంగా తిరుగుతుంటే 94409 00005 నెంబరు సమాచారం ఇవ్వాలి’ అని ప్రజలకు ఎస్పీ సూచించారు. 

Updated Date - 2021-01-19T07:21:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising