ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ దాడులకు భయపడొద్దు

ABN, First Publish Date - 2021-01-22T06:42:53+05:30

వైసీపీ చేస్తున్న దాడులపట్ల జనసేన కార్యకర్తలెవరూ భయపడవద్దని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ సూచించారు.

తిరుచానూరు వంతెన వద్ద పవన్‌కు అభిమానుల స్వాగతం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌


తిరుపతి, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): వైసీపీ చేస్తున్న దాడులపట్ల జనసేన కార్యకర్తలెవరూ భయపడవద్దని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ సూచించారు. దాడులపై ఎలా స్పందించాలో తిరుపతిలో పార్టీ  నాయకులతో ఆయన చర్చిం చారు. గురువారం మధ్యా హ్నం హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో తిరుపతి  చేరుకున్న పవన్‌కు ఘనస్వాగతం లభించింది.అక్కడినుంచి నగరంలోని విహాస్‌ హోటల్‌కు చేరుకున్న ఆయన అక్కడే పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ) సమావేశంలో పాల్గొని పలు అంశాలపై చర్చించారు. తిరుపతి ఉప ఎన్నికల్లో జనసేన-బీజేపీ తరపున ఉమ్మడి అభ్యర్థే పోటీలో ఉంటారన్న ఆయన  అభ్యర్థి ఎవరై నా కలిసి పనిచేయాలని సూచించినట్టు సమాచారం. కరోనా సమయంలో సామాజిక సేవలందించిన జనసైనికులను ప్రత్యేకంగా అభినందించారు. కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌, సభ్యులు పి.హరిప్రసాద్‌, కోన తాతారావు, పాలవలస యశస్వి,పంతం నానాజి, శ్రీనివాస యాదవ్‌, బి.నాయకర్‌, పితాని బాలకృష్ణ, ముత్తా శశిధర్‌, మనుక్రాంత రెడ్డి, కందుల దుర్గేశ్‌, మధుసూదన్‌ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొ న్నారు. అనంతరం శ్రీవారి దర్శనం కోసం పవన్‌ తిరుమలకు బయల్దేరి వెళ్లారు.

Updated Date - 2021-01-22T06:42:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising