ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జల్లికట్టులో అపశ్రుతి

ABN, First Publish Date - 2021-01-17T04:29:26+05:30

చంద్రగిరి మండలంలోని మల్లయ్యపల్లె, దోర్నకంబాల, మండపంపల్లె, గంగుడుపల్లె గ్రామాల్లో శనివారం జల్లికట్టు నిర్వహించారు. అల్లెలో పరుగులు తీస్తున్న కోడెగిత్తలను నిలువరించడానికి యువకులు పోటీపడ్డారు. ఈ సందర్భంగా కొందరికి స్వల్ప గాయాలయ్యాయి.

అల్లెలో పరుగు తీస్తున్న పశువులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గంగుడుపల్లెలో ఆవు మృతి


చంద్రగిరి, జనవరి 16: చంద్రగిరి మండలంలోని మల్లయ్యపల్లె, దోర్నకంబాల, మండపంపల్లె, గంగుడుపల్లె గ్రామాల్లో శనివారం జల్లికట్టు నిర్వహించారు. అల్లెలో పరుగులు తీస్తున్న కోడెగిత్తలను నిలువరించడానికి యువకులు పోటీపడ్డారు. ఈ సందర్భంగా కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. గంగుడుపల్లెలో అయితే ఓ ఆవును యువకులు నిలువరించే క్రమంలో అది కింద పడింది. వెనుక వస్తుండిన పశువులు దాన్ని తొక్కేయడంతో అది అక్కడికక్కడే చనిపోయింది. ఈ ఆవు గంగుడుపల్లెకు చెందిన పందికుంట నరిసింహారెడ్డికి చెందినదిగా గుర్తించారు. కాగా.. జల్లికట్టును తిలకించడానికి ఈగ్రామాలకు అధిక సంఖ్యలో జనం తరలివచ్చారు. దీనివల్ల ఈ ప్రాంతాలు తిరునాళ్లను తలపించాయి. అనుప్పల్లె-చంద్రగిరి రోడ్డు మార్గం కొంతసేపు స్తంభించింది. సీఐ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఎస్‌ఐలు రామకృష్ణ, చిన్నరెడ్డెప్పలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహించారు.



Updated Date - 2021-01-17T04:29:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising