ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పీఆర్సీ నివేదికను బహిర్గతం చేయండి: ఆపస్‌

ABN, First Publish Date - 2021-04-19T06:57:18+05:30

పీఆర్సీ నివేదికను వెంటనే బహిర్గతం చేసి.. 2018 జూలై ఒకటో తేదీనుంచి అమలుకు చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ సంఘం (ఆపస్‌) రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సీహెచ్‌ శ్రావణ్‌కుమార్‌, బాలాజీ కోరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి(విద్య), ఏప్రిల్‌ 18: పీఆర్సీ నివేదికను వెంటనే బహిర్గతం చేసి.. 2018 జూలై ఒకటో తేదీనుంచి అమలుకు చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ సంఘం (ఆపస్‌) రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సీహెచ్‌ శ్రావణ్‌కుమార్‌, బాలాజీ కోరారు. సంఘ రాష్ట్ర కార్యవర్గ వర్చువల్‌ సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా పలు తీర్మానాలు చేశారు. ప్రతి ప్రాథమిక పాఠశాలకూ ఒక హెచ్‌ఎం పోస్టు మంజూరు చేయాలని, పాత పింఛను విధానాన్ని పునరుద్ధరించాలని, పెండింగ్‌ డీఏలను విడుదల చేయాలని, విద్యాశాఖలో యాప్స్‌ వినియోగం తగ్గించి, ఏకీకృత సర్వీసు రూల్స్‌ అమలకు సాధ్యమైన మార్గాలపై వర్క్‌షాపు నిర్వహించి తగుమార్గాలు సూచించాలని, 17 నెలలుగా ఆగిపోయిన నెలవారీ పదోన్నతులను వెంటనే చేపట్టాలని తీర్మానించారు. అలాగే 20వేలకుపైగా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులకు వెంటనే డీఎస్సీ ప్రకటించాలని, నాడు-నేడు రెండో దశపనులను పంచాయతీరాజ్‌, ఆర్‌అండ్‌బీకి అప్పగించి హెచ్‌ఎంలకు పర్యవేక్షణ బాధ్యత మాత్రమే ఇవ్వాలని, బోధనేతర పనుల నుంచి టీచర్లకు మినహాయింపు ఇవ్వాలని, జగనన్న స్మార్ట్‌సిటీలలో ఉద్యోగులకు ఇళ్లస్థలాలు కేటాయించాలని, కొవిడ్‌ బారిన పడిన టీచర్లకు వేతనంతో కూడిన 15రోజుల సెలవును మంజూరు చేయాలని తీర్మానాలు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారక్‌ భరత్‌జీ, ఏబీఆర్‌ఎస్‌ఎం జాతీయ ఉపాధ్యక్షుడు పాలేటి వెంకటరావు, సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-19T06:57:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising