ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేవినేని అరెస్టు అప్రజాస్వామ్యం: టీడీపీ

ABN, First Publish Date - 2021-07-29T07:36:49+05:30

‘అక్రమ మైనింగ్‌ను పరిశీలించేందుకు వెళ్లిన మాజీ మంత్రి దేవినేని ఉమాపై దాడికి పాల్పడ్డారు. మళ్లీ ఆయన్ను అక్రమంగా అరెస్టు చేశారు’ అని మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ విమర్శిం చారు.

గాంధీ విగ్రహానికి వినతిపత్రం ఇస్తున్న టీడీపీ నేతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి, జూలై 28 (ఆంధ్రజ్యోతి): ‘అక్రమ మైనింగ్‌ను పరిశీలించేందుకు వెళ్లిన మాజీ మంత్రి దేవినేని ఉమాపై దాడికి పాల్పడ్డారు. మళ్లీ ఆయన్ను అక్రమంగా అరెస్టు చేశారు. ఇలా సాగుతున్న పాలన రాక్షస రాజ్యాన్ని తలపిస్తోంది’ అని మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ విమర్శిం చారు. టీడీపీ నేత దేవినేని ఉమాపై దాడి, అరెస్ట్‌ను నిరసిస్తూ బుధవారం తిరుపతిలోని గాంధీ విగ్రహం ముందు టీడీపీ నేతలు ఆందోళన చేపట్టారు. రాష్ట్రంలో ఒక మాజీ మంత్రికే రక్షణ లేకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏవిధంగా ఉంటుందో ప్రజలు అర్థం చేసుకోవా లన్నారు. అక్రమ అరెస్టులు, దాడులు, బెదిరింపులకు టీడీపీ నేతలు భయపడరని తిరుపతి పార్లమెంట్‌ నియోజవర్గ టీడీపీ అధ్యక్షుడు నరసింహ యాదవ్‌ అన్నా రు. వైసీపీ అవినీతి అక్రమాలను ప్రతిచోటా ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. ఈఆందోళనలో కార్పొరేటర్‌ ఆర్సీ మునికృష్ణ, మీడియా కోఆర్డినేటర్‌ శ్రీధర్‌ వర్మ, నాయకులు సింధూజ, ఊట్ల సురేంద్రనాయుడు, రుద్రకోటి సదాశివం, జయరాంరెడ్డి, చంద్ర, భారతి, చంద్రారెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-29T07:36:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising