ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పశువుల మేతగా పంటలు

ABN, First Publish Date - 2021-05-20T06:05:25+05:30

కరోనా దెబ్బకు కూరగాయలు, పూలకు సరైన ధరలు లేక కోతకోసిన పంటలను రైతులు రోడ్డు పక్కన పడేస్తున్నారు.

దానమయ్యగారిపల్లె వద్ద పశువులు, మేకలకు వదిలేసిన రైతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ధరలు లేక రోడ్డ పక్కన పడేస్తున్న టమోటా, బంతిపూలు


 వి.కోట, మే 19: కరోనా దెబ్బకు కూరగాయలు, పూలకు సరైన ధరలు లేక కోతకోసిన పంటలను రైతులు రోడ్డు పక్కన పడేస్తున్నారు. కొందరైతే తోటలోన్నే వదిలేస్త్తున్నారు. టమోటా పంట బాగా దిగుబడి వచ్చినా వాటిని కోతకోసి మార్కెట్‌కు తరలించినా కిలో రూ. 3 నుండి 5 పలుకుతుండటంతో గిట్టుబాటుకాక, వాటిని కొనే వారు లేక రైతులు  వాటిని రోడ్డు పక్కన పడేస్తున్నారు. వి.కోట మండల పరిధిలో చాలా తోటలను కోతకోయ లేక రైతులు వాటిని పశువులు, మేకలు, గొర్రెలకు మేతగా వదిలేస్తున్నారు. ఆళ్ళవారిపల్లె వద్ద బంతిపూలు ఏపుగా పెరిగినా వాటికి గిట్టుబాటు లేక పూలను కోయకుండా అలాగే తోటలో వదిలేశారు. వి.కోట నుంచి రోజూ కూరగాయలు చెన్నై, తిరుచ్చి, మధురై, కోయంబత్తూరు, బెంగళూరు తదితర ప్రాంతాలకు ఎగుమతి చేసేవారు. తమిళనాడు, కర్ణాటకలో లాక్‌డౌన్‌, వారాంతంలో సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలు చేస్తుండటంతో కూరగాయల ఎగుమతికి అడ్డుకట్టపడింది. దీంతో ధరలు పతనమై రైతులకు తీవ్ర నష్టాలు, కష్టాలు మిగిల్చింది. 




 



Updated Date - 2021-05-20T06:05:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising